Virat Kohli New Look: భారత క్రికెటర్లలో స్టైల్ ఐకాన్ల్లా ఉన్న వారిలో మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒకడు. అతడి స్టైల్‌కు కితాబులిచ్చేవారితో పాటు ఆ స్టైల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి సిరీస్‌కు ముందు కొహ్లీ.. తన స్టైల్లో కొన్ని మార్పులు చేస్తుంటాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న విరాట్.. తన కొత్త హెయిర్ స్టైల్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
సెలెబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రషీద్ సల్మానీ.. కోహ్లీకి ఈ కొత్త రూపు తీసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. కోహ్లీ చాలా అందంగా ఉన్నాడని.. మరింత హాట్‌గా మారాడని.. ఈ ఫొటోలపై పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే కోహ్లీ కొత్త లుక్ చూసి అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు. 'విత్ ద కింగ్ హిమ్ సెల్ఫ్' అని రిప్లై ఇచ్చాడు. అలానే సింగర్ హార్డీ సంధు 'చా గయే గురూ' అంటూ కామెంట్ చేశాడు. అభిమానులైతే 'కోహ్లీ చాలా హాట్‌గా కనిపిస్తున్నాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.