Virat Kohli Most Searched Cricketer In Google :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ 'కింగ్' మరో అరుదైన ఘనత సాధించాడు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 25 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా వెతికిన క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ మేరకు గూగుల్ రూపొందించిన ఓ వీడియోను ఎక్స్‌వేదికగా షేర్ చేసింది.
గూగుల్ సెర్చ్‌ను ఉద్దేశిస్తూ '25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం వెతకడం మొదలు పెట్టింది. ఇక మిగతాదంతా చరిత్రే' అంటూ ఆ వీడియో ప్రారంభమైంది. అందులో గూగుల్ చరిత్రలో అత్యంత ఎక్కువ మంది వెతికిన మొదటి అడుగుగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన దృశ్యం నిలిచింది. 1980వ దశకం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది శోధించారట. మరోవైపు అత్యధిక మంది సెర్చె చేసిన అథ్లెట్‌గా ఫుటబాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో పాటు అత్యధిక మంది శోదించిన ఆటగా సాకర్ నిలిచింది. ఎక్కవ మంది వెతిని జానర్లో బాలీవుడ్ ఉంది.
Top 10 most searched things in India in 2023 :అయితే దీంతోరాటు 2023లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్స్ జాబితా కూడా ఇదివరకే గూగుల్ రిలీజ్ చేసింది. అందులో స్పోర్ట్స్ కేటగిరీలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేసినట్లు తెలిపింది. ఇంకా క్రీడల్లో అత్యధిక మంది సెర్చ్ చెసిన విషయాలు ఇవే.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ (India Premier League 2023)
- క్రికెట్ వరల్డ్ కప్ (ICC ODI World Cup 2023)
- ఆసియా కప్ (Asia Cup 2023)
- మహిళల ప్రీమియర్ లీగ్- డబ్ల్యూపీఎల్ (Womens Premier League 2023)
- ఆసియా క్రీడలు (Asian Games 2023)
- ఇండియన్ సూపర్ లీగ్ (Indian Super League 2023)
- పాకిస్థాన్ సూపర్ లీగ్ (Pakistan Super League 2023)
- ది యాషెస్ (The Ashes 2023)
- మహిళల క్రికెట్ వరల్డ్ కప్ (Womens World Cup 2023)
- ఎస్ఏ20 (South Africa T20 League 2023)
చరిత్ర తిరగరాసిన 'విరాట్' - 50వ సెంచరీతో సచిన్ రికార్డ్ బ్రేక్
కెప్టెన్సీలోనూ విరాట్ భేష్- టెస్టుల్లో రన్ మెషీన్ రికార్డులు తెలుసా?