Virat Kohli Money Heist: టీమ్ఇండియా టెస్ట్ సారథి కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడి గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. విరాట్‌కు ప్రైవేట్ జెట్ ఉందా? బ్లాక్‌వాటర్ తాగుతాడా? అతని హాబీస్ ఏంటి? ఇలా అతని గురించి నెట్టింట్లో తెగ ఆరా తీస్తుంటారు. అయితే తాజాగా ఓ షూట్లో పాల్గొన్న విరాట్ హిలీయం బెలూన్ ఛాలెంజ్‌ను స్వీకరించి తన గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ సంగతులు ఏంటో తెలుసుకుందాం..
విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు?
క్రికెట్ ఆడతా.
కోహ్లీ కస్టమర్ కేర్ నంబర్ ఏంటి?
181818. అయితే మీరు కాల్ చేయరనే ఆశిస్తున్నా.
కోహ్లీకి ప్రైవేట్ జెట్ ఉందా?
లేదు. అదొక రూమర్ మాత్రమే. నాకు సొంత జెట్ లేదు.
కోహ్లీ బాగా చదివేవాడా?