తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎగతాళి చేయడమంటే కోహ్లీకి ఇష్టం'.. ప్రతీకారం తీసుకునే సమయం ఇదే!

భారత్​-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్​-గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీంతో, గతంలో ఎదురైన ఘోర పరాభవంపై ప్రతీకారం తీర్చుకునేందుకు టీమ్​ఇండియా సిద్ధమైంది. మరోవైపు, ఆస్ట్రేలియా ప్లేయర్లను ఎగతాళి చేయడమంటే విరాట్​ కోహ్లీకి చాలా ఇష్టమని భారత బ్యాటింగ్​ మాజీ కోచ్​ సంజయ్​ బంగర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంకా ఏమన్నాడంటే..

virat kohli loves to play against australia
virat kohli loves to play against australia

By

Published : Feb 6, 2023, 9:23 PM IST

ఫిబ్రవరి 9న భారత్​-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్​ గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్​ అభిమానుల మదిలో ఓ విషయం మెదులుతోంది. టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. అదేంటంటే.. 2020లో భారత్​-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్​-గావస్కర్ సిరీస్​ జరిగింది. అయితే సిరీస్​ మొత్తంలో ఓ పింక్​ బాల్​ టెస్టు(డే అండ్‌ నైట్‌ టెస్ట్‌) ఆడాలని అనుకునేవారు.
అలా మొదట్లోనే పింక్​ బాల్​ టెస్టు ఆడారు. మొదటి ఇన్నింగ్స్​లో.. తొలుత బ్యాంటింగ్​ చేసిన భారత్​ 244 పరుగులు చేసి.. ఆసీస్​ను 191 పరుగులకే ఆల్​ ఔట్​ చేశారు. దీంతో అందరూ భారత్​ విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ సీన్​​ రివర్స్​ అయింది. రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 36 పరుగులకే చేతులెత్తేసి ఆల్​ ఔట్​ అయింది. అయితే, ఆ సిరీస్‌ను 2-1తో టీమ్​ఇండియా గెలుచుకుంది. కానీ, ఆ 36 పరుగుల ఓటమి మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీసుకోలని అనుకుంటున్నారు టీమ్ఇండియా ప్లేయర్లు. ఇక, రోహిత్‌ సేన ఎలాంటి రివేంజ్‌ తీర్చుకుంటుందో వేచి చూడాలి.

ఎగతాళి చేయడమంటే కోహ్లీకి ఇష్టమట..
కంగారూలతో ఆడటమంటే కోహ్లీకి చాలా ఇష్టమట. ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్లను ఎగతాళి చేయాడనికి విరాట్​ ఇష్టపడతాడట. ఈ మేరకు టీమ్​ఇండియా మాజీ బ్యాంటింగ్​ కోచ్​ సంజయ్ బంగర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు బంగర్​ మాట్లాడుతూ.."ఆసీస్​తో ఆడటానికి, ఆ టీమ్​ ప్లేయర్లను ఎగతాళి చేయడానికి విరాట్ కోహ్లీ ఇష్టపడతాడు. కోహ్లీ తన ఆటను మెరుగుపర్చుకుంటాడు. టెస్టు క్రికెట్‌ విరాట్ కోహ్లీ​ నుంచి ఉత్తమ ప్రదర్శనను అందించే ఫార్మాట్".
"గత రెండున్నరేళ్లుగా అతడు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. వన్డేలు, టీ20ల్లో ఆస్వాదించిన ఫామ్​ను కొనసాగించాలని అకుంటున్నాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. కాబట్టి, విరాట్​ న మంచి ఆటతీరును కనబర్చి.. ఈ సిరీస్‌పై ప్రభావం చూపుతాడు. టెస్టు ఫార్మాట్‌లో ఎదురయ్యే ఛాలెంజెస్​ను విరాట్​ సులువుగా అధిగమిస్తాడని మేము చాలా ఆశిస్తున్నాము" అని చెప్పుకొచ్చారు. కాగా, భారత్, ఆసీస్ మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో మొదటి మ్యాచ్​ నాగ్​పుర్ వేదికగా జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details