తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీకి డ్యాన్స్​ నేర్పిన చాహల్ భార్య ధనశ్రీ.. వీడియో ఇదిగో! - ధనశ్రీ వర్మ న్యూస్

Virat dance with Dhanashree: రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఇటీవల షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీకి డ్యాన్స్​ నేర్పిస్తూ కనిపించింది స్పిన్నర్ చాహల్ భార్య ధనశ్రీ వర్మ.

virat kohli, dhansree verma
విరాట్ కోహ్లీ, ధనశ్రీ వర్మ

By

Published : Nov 27, 2021, 10:42 AM IST

Virat dance with Dhanashree: రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవలే షేర్ చేసిన 'నెవర్​ గివ్ అప్.. డోంట్ బ్యాక్ డౌన్' మ్యూజికల్ వీడియో ఉర్రూతలూగించింది. అయితే ఆర్సీబీ తమ అధికారిక ఇన్​స్టా ఖాతాలో మరో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను మరింత ఆకర్షిస్తోంది.

టీమ్​ఇండియా లెగ్​ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ 'నెవర్​ గివ్​ అప్' సాంగ్​కు(RCB New Theme Song) డైరెక్టర్​గా, కొరియోగ్రాఫర్​గా వ్యవహరించింది. అయితే.. ఈ పాట మేకింగ్​ సమయంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీకి ఆమె డ్యాన్స్​ నేర్పించిన వీడియో ప్రస్తుతం వైరల్​ అవుతోంది.

ఆర్‌సీబీ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, దేవదత్‌ పడిక్కల్‌, యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్‌ సైనీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్‌ సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, కైల్‌ జేమీసన్‌ తదితరులు ఈ పాటలో తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఇటీవల దుబాయిలో ఐపీఎల్‌ జరిగిన సమయంలో ఈ పాటను రూపొందించినట్లు సమాచారం.

ఫుల్​ ఫాలోయింగ్..

చాహల్ భార్య ధనశ్రీ వర్మకు ఫ్యాన్స్​ ఫాలోయింగ్ ఎక్కువే. బాలీవుడ్​ పాటలను రీక్రియేట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ఆమెకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్​కు దాదాపు 25 లక్షల మంది సబ్​స్క్రైబర్లు ఉన్నారు.

ఇదీ చదవండి:

ఉత్తమ బ్యాటర్​ విరాట్ కోహ్లేనే: మహ్మద్ ఆమిర్

ABOUT THE AUTHOR

...view details