Virat Kohli Leadership Qualities: నాయకత్వంపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో నాయకుడిగా ఉండాలంటే.. సారథిగానే ఉండాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డాడు. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పుడు కెప్టెన్‌లానే ఆలోచిస్తానని తెలిపాడు. ముందుగా తామేమి సాధించగలం.. దానిపై పూర్తి అవగాహన ఉండాలన్నాడు.
"నాయకుడిగా ఉండటానికి కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ధోని జట్టులో ఉన్నప్పుడు అతను నాయకుడిగా లేనట్లు కాదు. గెలుపోటములు మన చేతుల్లో ఉండవు. ప్రతిరోజు మెరుగ్గా ఉండాలనేది మన చేతుల్లో ఉండదు.. స్వల్పవ్యవధిలో చేయగలిగింది కాదు. జట్టులో ఉన్నన్నాళ్లు అది మన బాధ్యత. అలా ముందుకు సాగడం కూడా నాయకత్వంలో ఓ భాగమే. అన్ని రకాల బాధ్యతలు, అవకాశాలను స్వీకరించాలని భావిస్తాను. ధోని నేతృత్వంలో కొంతకాలం ఆడాను. తర్వాత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాను. జట్టులో ఆటగాడిగా ఉన్నప్పటికీ కెప్టెన్‌గానే ఆలోచిస్తాను."
- విరాట్ కోహ్లీ