టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐసీసీ టెస్ట్ టీమ్, వన్డే టీమ్, టీ20 జట్టుల్లో భాగమైన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేస్తూ ఉంటోంది. గతంలోనే ఐసీసీ టెస్ట్ టీమ్, వన్డే టీమ్‌ల్లో పలుమార్లు చోటు దక్కించుకున్న విరాట్.. టీ20 టీమ్‌కు ఎంపికవ్వడానికి మాత్రం టైమ్ తీసుకున్నాడు. గతేడాది అసాధారణ ప్రదర్శన కనబర్చిన కింగ్ కోహ్లీ.. ఆ ముచ్చట కూడా తీర్చుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన 2022 అత్యుత్తమ జట్టులో విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. దాంతో క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లకు చెందిన ఐసీసీ బెస్ట్ ఎలెవెన్స్‌లో చోటు దక్కించుకున్న ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు.
జట్టులో చోటే కష్టమన్న పరిస్థితుల నుంచి..
కోహ్లీ 2022 జూలై వరకు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటే కోల్పోతాడని ప్రచారం జరిగింది. నెల రోజుల పాటు ఆటకు దూరమైన విరాట్.. ఆసియాకప్ 2022తో రీఎంట్రీ ఇచ్చాడు. అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాది.. మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అక్కడి నుంచి విరాట్ జోరు కొనసాగుతూనే ఉంది. ఆసియాకప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. టీ20 ప్రపంచకప్‌లో 296 పరుగులతో హయ్యెస్ట్ రన్నర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌పై విరాట్(82 నాటౌట్) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.