ప్రపంచకప్‌నకు ముందే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. కచ్చితమైన ప్రణాళిక ఉంటే తప్ప విరాట్‌తో తలపడటం అంత సులభం కాదన్నాడు.
కోహ్లీతో అంత ఈజీ కాదు: ఆసీస్ కెప్టెన్ - కోహ్లీ ఆసీస్ కెప్టెన్ ఫించ్
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌తో తలపడటం అంత సులభం కాదన్నాడు.
"విరాట్ లాంటి ప్లేయర్‌ను ఎదుర్కోవడమంటే ధైర్యంతో కూడుకున్న పని. పదిహేనేళ్లుగా అతడు సాధించిన విజయాలు తననెప్పటికీ గొప్ప ప్లేయర్‌గానే గుర్తుచేస్తాయి. ముఖ్యంగా టీ20ల్లో అతడు తన ఆటతీరును మలుచుకున్న విధానం వల్ల విరాట్‌తో తలపడాలంటే ఎవరైనా కచ్చితమైన ప్లాన్‌తో వెళ్లాల్సిందే. 71 సెంచరీలు కొట్టడమేంటే నమ్మశక్యం కాని విషయం. అతడో గొప్ప ప్లేయర్.." అంటూ కొనియాడాడు. 2019 తర్వాత విరాట్ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న ఈ పరుగుల వీరుడు ఎట్టకేలకు అఫ్గనిస్థాన్‌పై శతకం కొట్టాడు.
ఇదీ చూడండి: హాట్ టాపిక్‌గా అథ్లెట్ వినేశ్ ఫొగాట్.. వారిపై ఫుల్ ఫైర్