తెలంగాణ

telangana

ETV Bharat / sports

Virat Kohli International Debut : విరాట్​ @ 15 ఏళ్లు.. సుదీర్ఘ కెరీర్​లో రన్నింగ్​ మెషిన్​ రికార్డులు ఇవే..

Virat Kohli International Debut : స్టార్​ క్రికెటర్​ విరాట్​ కోహ్లి క్రికెట్​ రంగంలోకి అడుగుపెట్టి నేటితో(ఆగస్ట్​ 18) 15 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారి శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్​తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విరాట్.. ఈ 15 ఏళ్ల సుదీర్ఘ ఫార్మాట్​లో పలు రికార్డులను నెలకొల్పాడు. అవేంటంటే..

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 18, 2023, 1:17 PM IST

Virat Kohli International Debut : 2008లో సరిగ్గా ఇదే రోజున .. ప్రపంచ క్రికెట్‌లో ఒక అద్భుతం జరిగింది. శ్రీలంకపై జరిగిన వన్డే మ్యాచ్​తో అంతర్జాతీయ ఫార్మాట్​లోకి టీమ్ఇండియా బ్యాటర్​ విరాట్​ కోహ్లి అరంగేట్రం చేశాడు. అయితే తన మొదటి మ్యాచులో అతను పెద్దగా రాణించలేదు. కేవలం 12 పరుగులును స్కోర్​ చేసి అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే అప్పట్లో అతని ఆటతీరును గమనించిన ప్రతి ఒక్కరూ కోహ్లికి క్రికెట్​లో మెరుగైన భవిష్యత్తు ఉందంటూ అభిప్రాయపడ్డారు. అనుకున్నట్లుగానే విరాట్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు.

తన కెరీర్‌ను మొదట్లో చాలా నెమ్మదిగా ఆరంభించిన కోహ్లి.. తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అత్యద్భుతమైన రికార్డులను అందుకున్నాడు. తొలి మ్యాచ్‌లో డీలా పడ్డ రన్నింగ్​ మెషిన్​.. రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అందరి చేత ఔరా అనిపించాడు. భారత జట్టు 143 పరుగులు ఛేజింగ్‌ చేస్తుండగా 37 పరుగులు చేశాడు.

బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉన్న పిచ్‌పై మిగతా బ్యాటర్లు తేలిపోయినప్పటికీ.. కోహ్లి మాత్రం చాలా పట్టుదలగా ఆడాడు. ఆ తర్వాత టీమ్​ఇండియా ఛేజింగ్‌లోనూ ఎప్పుడు కష్టపడ్డా తనే ముందుండి జట్టును విజయపథంలోకి నడిపించాడు.

తాజాగా తన అంతర్జాతీయ కెరీర్‌లో 500వ మ్యాచ్​ ఆడిన కింగ్​ కోహ్లీ.. తన ఫామ్​తో అందరిని ఆశ్చర్యపరుస్తూ దూసకెళ్లాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో శతకం సాధించి చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకాన్ని సాధించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే కాకుండా మరెన్నో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Virat Kohli Records : ఇక కోహ్లి అంతర్జాతీయ అరంగేట్రాన్ని అభిమానులు నెట్టింట సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కోహ్లి కెరీర్ ఆరంభ రోజులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్​ చేస్తూ ట్రెండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ స్టార్​ బ్యాటర్ నమోదు చేసుకున్న రికార్డులు ఏవంటే..

  • అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేలలో 46, టెస్టుల్లో 29, టీ20లో కలిపి మొత్తం 76 సెంచరీలు బాదాడు.
  • అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు కూడా విరాట్ కోహ్లి పేరిట ఉన్నాయి. తన కెరీర్​లో ఇప్పటి వరకు మొత్తం 20 అవార్డులును దక్కించుకున్నాడు.
  • అంతర్జాతీయ టీ20 ఫార్మాట్​లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత కూడా విరాట్​కే సొంతం. ప్రస్తుతం ఈ స్టార్​ ప్లేయర్​.. తన ఖాతాలో 4008 పరుగులు వేసుకున్నాడు. అంతే కాకుండా ఈ ఫార్మాట్​లో 4 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ కూడా కోహ్లి ఒక్కడే కావడం విశేషం.
  • వన్డేలలో కనీసం 50 ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్లలో విరాట్ కోహ్లిదే అత్యుత్తమ సగటు. అతడు 275 వన్డేల్లో ఏకంగా 57.3 సగటుతో పరుగులు చేశాడు.
  • వన్డేల్లో 7 వేల నుంచి 12 వేల పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్​గా విరాట్​ చరిత్రకెక్కాడు.
  • వన్డే క్రికెట్​లో కోహ్లి ఇండియా తరఫున అత్యధిక క్యాచ్​లు పట్టాడు. మొత్తంగా అతను 142 క్యాచ్​లు పట్టాడు.
  • వన్డేల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలను సాధించిన రికార్డు కూడా విరాట్​ పై ఉంది. శ్రీలంకపై జరిగిన వన్డేలలో విరాట్​ ఏకంగా 10 సెంచరీలు నమోదు చేశాడు..

కోహ్లీ సక్సెస్ మంత్ర ఇదే.. వారి నుంచి అవి నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగాడట!

500 మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ సెంచరీ.. డాన్​ బ్రాడ్​మన్ సరసన 'కింగ్​'

ABOUT THE AUTHOR

...view details