Virat Kohli Instagram Income Per Post 2023 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. రికార్డుల్లోనే కాకుండా సంపాదనలోనూ అందరికంటే ముందున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విరాట్.. పలు ప్లాట్‌ఫామ్‌లలో ఫాలోవర్లను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీని ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం విరాట్.. సంపాదనలో అందరు ఆటగాళ్ల కన్నా ముందున్నాడట. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో.. కోహ్లీ ఒక్కో పోస్టుకు వసూలు చేసే మొత్తం.. కొందరు క్రికెటర్ల ఏడాది మొత్తం ఆదాయం కంటే ఎక్కువట. ఈ విషయాన్ని 'హూపర్ హెచ్‌క్యూ' అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.
Virat Kohli Instagram Post Charge : ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం ఛార్జ్ చేసే తొలి 20 మంది పేర్లను 'హూపర్ హెచ్‌క్యూ' సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో కోహ్లీ 14 స్థానంలో ఉన్నాడు. ఆ జాబితా ప్రకారం విరాట్.. సింగిల్ స్పాన్సర్డ్ పోస్టుకు (virat kohli instagram post price) రూ.11 కోట్లు తీసుకుంటాడు. అతడికి 25.5 కోట్ల (Virat Kohli Instagram Followers) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ 20 మంది లిస్ట్‌లో ఇండియా నుంచి విరాట్ ఒక్కడే స్థానం దక్కించుకోవడం విశేషం. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఈ జాబితాలో 29వ స్థానం దక్కించుకుంది. ఆమె ఒక ఇన్‌స్టా పోస్టుకు రూ.4.4 కోట్లు వసూలు చేస్తోంది.
Hopper Hq Instagram Rich List :తమ జాబితాపై హూపర్ హెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు మైక్ బాండర్ స్పందించారు. సూపర్ స్టార్లు ఇన్‌స్టా నుంచి ఆర్జిస్తున్న సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తోందని.. వారి సంపాదన ఏళ్లు గడిచేకొద్దీ పెరుగుతోందని వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌పై వీరి సంపాదన ఏటా పెరుగుతూనే ఉండటం చూసి తాను ఆశ్చర్యపోతున్నానని చెప్పారు. కొత్త తరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు వచ్చినా.. సంప్రదాయ సెలబ్రెటీల ఆకర్షణ ఏమాత్రం తగ్గనట్లే కనిపిస్తోందని తెలిపారు. ఇక, ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ మైదానంలోనే కాకుండా.. సామాజిక మాధ్యమాల వేదికలపైనా రాజ్యమేలుతున్నారని.. సామాన్యూలపై వారి ప్రభావాన్ని ఇది తెలియజేస్తోందని అన్నారు.