Virat Kohli Break: టీమ్ఇండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ.. భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భాగంగా వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ ఊహాగానాలపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి కావాలని విరాట్ అధికారికంగా బీసీసీఐని కోరలేదని తెలిపారు.
"వన్డే సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు విరాట్ కోహ్లీ అధికారికంగా చెప్పలేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేదా సెక్రటరీ జై షాకు సమాచారం అందించలేదు. టెస్టు సిరీస్ అనంతరం అతడు గాయం కారణంగా లేదా వ్యక్తిగత కారణాల వల్ల వన్డే సిరీస్‌కు దూరమైతే అది భిన్నమైన అంశం."
-బీసీసీఐ అధికారి.
ప్రస్తుతం తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం విరాట్ జనవరి 19, 21, 23న జరగనున్న వన్డేల్లో ఆడతాడని ఆ అధికారి చెప్పుకొచ్చారు. క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో సహా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.
"దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం కూడా భారత క్రికెటర్లు బయోబబుల్‌లో ఉండాల్సి ఉంటుంది. శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో క్రికెటర్లు మూడు వారాల పాటు బబుల్‌లో ఉండనున్నారు" అని అధికారి చెప్పారు.