తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ ఫ్యాన్స్​కు మళ్లీ నిరాశే.. ఈ ఏడాది కూడా సెంచరీ లే! - teamindia vs south africa test series

గతేడాది ఒక్క శతకం కూడా చేయని టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ ఈ ఏడాదిని కూడా సెంచరీ లేకుండానే ముగించాడు. దీంతో అతడి ఫ్యాన్స్​ నిరాశ చెందుతున్నారు.

కోహ్లీ సెంచరీ, kohli century
కోహ్లీ సెంచరీ

By

Published : Dec 29, 2021, 5:30 PM IST

సెంచరీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విరాట్ కోహ్లీ అభిమానులను ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. రెండేళ్ల నుంచి ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్న విరాట్​.. 2021లో కూడా సెంచరీ చేయకుండానే ముగించాడు. నేడు(బుధవారం) దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట రెండో ఇన్నింగ్స్​లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మార్కొ జాన్సెన్​ బౌలింగ్​లో షాట్​కు యత్నించి డికాక్​ చేతికి క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు.
అదే చివరి సెంచరీ
కోహ్లీ చివరిసారిగా 2019 ఈడెన్​ గార్డెన్స్​లో బంగ్లాదేశ్​తో జరిగిన డేనైట్​ టెస్టులో శతకం బాదాడు. ఆ తర్వాత ఇప్పటివరకు సెంచరీ చేయలేదు. అప్పటి నుంచి అతడు 60 ఇన్నింగ్స్ ఆడగా.. 39.20 సగటుతో 2078 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధ శతకాలు ఉన్నాయి. మరి వచ్చే ఏడాదైనా సెంచరీతో అభిమానులను అలరిస్తాడో లేదో చూడాలి.

కెప్టెన్సీకి గుడ్​బై

ఫామ్​లో లేని కారణంగా.. బ్యాటింగ్​పై దృష్టిసారించడానికి టీ20 కెప్టెన్సీకి ఇటీవలే గుడ్​బై చెప్పాడు కోహ్లీ. ఆ తర్వాత అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ ఆ బాధ్యతలను రోహిత్​ శర్మకు అప్పగించింది టీమ్ ​మేనేజ్​మెంట్​.

ఇదీ చూడండి: కోహ్లీ అలా ఉండటం వల్లే భారత్​కు విజయాలు: భజ్జీ

ABOUT THE AUTHOR

...view details