తెలంగాణ

telangana

ETV Bharat / sports

Virat Kohli: విరాట్ కోహ్లీ.. సెంచరీ ఇంకెప్పుడు?

ఈ జనరేషన్​లో అత్యుత్తమ బ్యాట్స్​మెన్ ఎవరు అంటే బల్లగుద్ది మరీ కోహ్లీ(Kohli) అని చాలామంది చెబుతారు. అయితే అతడి ఆటలోని పదును కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తోంది. పరుగులు చేయడంలోనూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు.

Virat Kohli
కోహ్లీ

By

Published : Aug 26, 2021, 10:04 AM IST

ఇంగ్లాండ్​తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా ఘోరంగా బ్యాటింగ్ చేసింది. 78 పరుగులకు ఆలౌట్​ కాగా, బ్యాట్స్​మెన్​లో కనీసం ఒక్కరైనా 20 పరుగులు చేయకుండా ఔట్ అయిపోయారు. ఇలా జరగడం టెస్టుల్లో భారత్​కు ఇదే తొలిసారి. మరోవైపు కెప్టెన్​ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ మ్యాచ్​లోనూ నిరాశే ఎదురైంది.

విరాట్ కోహ్లీ

చివరగా 2019 నవంబరులో బంగ్లాదేశ్​పై డే అండ్ నైట్​ టెస్టులో శతకం నమోదు చేసిన విరాట్.. ఆ తర్వాత ఏ ఫార్మాట్​లోనూ ముడంకెల స్కోరు అందుకోలేకపోయాడు. అలా ఇప్పటికీ 50 ఇన్నింగ్స్​లు దాటిపోగా.. 642 రోజులు గడిచిపోయాయి. ఇంకా ఎప్పుడు ఆ మార్క్​ను అందుకుంటాడో అని క్రికెట్​ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ కోహ్లీ ఒకేరకంగా ఔట్ అవుతూ వస్తున్నాడు. వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి.. కీపర్​ లేదంటే స్లిప్​ ఫీల్డర్​కు చిక్కుకుంటున్నారు. మూడో టెస్టులోనూ ఇలానే జరిగింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్సన్​ బౌలింగ్​లో ఔటయ్యాడు.

"కోహ్లీ ఫెంటాస్టిక్ ప్లేయర్. మీరు జట్టుగా నిశ్శబ్దంగా ఉండాలనుకునే వ్యక్తి. అయితే టెస్టుల్లో చెలరేగడం మొదలుపెడితే అతడిని ఆపడం ఎవ్వరి తరం కాదు" అని అండర్సన్​, తొలిరోజు ఆట అనంతరం చెప్పాడు.

విరాట్ కోహ్లీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details