ప్రస్తుత క్రికెట్లో 'కింగ్' విరాట్ కోహ్లీ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. తన ఆటతో, కెప్టెన్సీతో ఆటలో మైలురాళ్లను అధిగమిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడుతున్న ఇతడు.. ఆదివారానికి(జూన్ 20) పదేళ్ల టెస్టు కెరీర్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా టెస్టుల్లో విరాట్ నెలకొల్పిన పలు ఘనతులు మీకోసం.
*2011 జూన్ 20న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ.. ఆ తర్వాత కాలంలో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాడు. ఈ ఫార్మాట్లో ఎక్కువ పరుగులు చేసిన భారత్ ఆరో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు.
*ఐసీసీ టీ20 ప్రపంచకప్, టెస్టు ఛాంపియన్షిప్, వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ.
*అరంగేట్రం సిరీస్‌లో వెస్టిండీస్‌తో నాలుగో టెస్టులో, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి వరుసగా రెండు అర్ధసెంచరీలు చేశాడు. దీంతో ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
*టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆస్ట్రేలియాపై తన తొలి సెంచరీ చేశాడు. ఇది విరాట్‌కు ఎనిమిదో టెస్టు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయినప్పటికీ, విరాట్ బ్యాటింగ్‌పై ప్రశంసలు వచ్చాయి.
*7500కు పైగా పరుగులు చేసిన విరాట్.. ఈ ఫార్మాట్లో ఎక్కువ రన్స్ కొట్టిన భారత్ బ్యాట్స్‌మెన్‌లో ఆరోవాడు. కెప్టెన్‌గానూ6 5392 పరుగులతో ఉన్నాడు కోహ్లీ. 58 సగటుతో 20 సెంచరీలు ఇందులో ఉన్నాయి.