క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ.. ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాళ్లు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు ఉన్న సందడే వేరు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్ కప్ 2022 వచ్చేసింది. మెస్సీ, రొనాల్డోలపైనే అందరి దృష్టి. వీరిద్దరికీ ఈ ప్రపంచకప్పే చివరిదని భావిస్తున్న నేపథ్యంలో.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల మధ్యే ఫైనల్ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్లు కలిసి ఫుట్‌బాల్ కాకుండా ఓ ఆట ఆడటం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఫిఫా ప్రపంచ కఫ్ నేపథ్యంలో ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్‌లో రికార్డుల స్టార్ కింగ్ కోహ్లీ కూడా ఆ ఫొటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డో ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో చూసి.. 'ఎంత అద్భుత చిత్రమో' అంటూ కామెంట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.