ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూసుకెళ్లాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన విరాట్ .. బ్యాటర్ల విభాగంలో టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 283 పరుగులు చేసిన అతడు.. సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మార్క్‌తో వన్డే ర్యాంకింగ్స్‌లో 887 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు చేరువయ్యాడు. కాగా కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్ ఉంది. విరాట్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. బాబర్‌ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు.
ODI rankings: దూసుకెళ్లిన కోహ్లీ, సిరాజ్.. అదే జరిగితే పాక్ కెప్టెన్ బాబర్‌కు ఎసరే! - Babar Azam odi rankings
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్స్ కోహ్లీ, సిరాజ్ అదరగొట్టారు. టాప్-5లోకి దూసుకెళ్లారు.

ODI rankings: దూసుకెళ్లిన కోహ్లీ, సిరాజ్.. అదే జరిగితే పాక్ కెప్టెన్ బాబర్‌కు ఎసరే!
ఇక జరగబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్‌ను వెనుక్కి నెట్టి రెండో ర్యాంక్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా బౌలర్ల విభాగంలో సత్తా చాటాడు. తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 685 పాయింట్లతో మూడో ర్యాంక్‌కు సాధించాడు.
ఇదీ చూడండి:ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి ఇవి తీసుకెళ్తే రానివ్వరు