Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ మైక్ హెస్సన్. కోహ్లీ జట్టు కోసం శాయశక్తులా కృషిచేశాడని పొగిడాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్ విషయంలో కోహ్లీని, డివిల్లియర్స్ను సంప్రదించామన్నాడు. ఆర్సీబీ అన్బాక్స్ కార్యక్రమంలో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ఆర్సీబీ ఫ్రాంచైజీ కోసం విరాట్ కోహ్లీ శాయశక్తులా కృషిచేశాడు. జట్టు విజయం కోసం ప్రాణంపెట్టేశాడు. బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడంటేనే అతడికి విశ్రాంతి కావాలనే విషయం అర్థమవుతోంది. అతడు ఆర్సీబీ సీనియర్ ఆటగాడిగా కొనసాగాలనుకున్నాడు. దానిని మేము ఎంతో గౌరవిస్తున్నాము."