Virat Kohli Captaincy Ravi Sastri: భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై స్పందించాడు. విరాట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని పేర్కొన్నాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్లో బాగా ఆడడానికి ఆ నిర్ణయం దోహదం చేస్తుందన్నాడు.
"అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం కాస్త బాధ పెట్టే విషయమే.. కానీ విరాట్ అప్పటి నుంచి ఒత్తిడి లేకుండా ఉంటున్నాడు. దీని వల్ల తన కెరీర్లో మరికొన్ని సంవత్సరాల పాటు ఆటను దిగ్విజయంగా ఆడతాడు. కెప్టెన్సీని వదులుకున్న విరాట్ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. అయితే అతడు భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండటం అంత సులభం కాదు. భారత జట్టు సారథి ఎదురుకున్నంత ఒత్తిడిని మరే జట్టు కెప్టెన్ ఎదురుకోలేడు"
- రవిశాస్త్రి, భారత మాజీ హెడ్ కోచ్