టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ కూడా కొట్టక చాలా మాటలు పడ్డాడు కోహ్లీ. సర్వత్రా విమర్శలు.. ఉచిత సలహాలు.. జట్టుకు భారం అనే మాటలు.. ఇలా మానసికంగా వేదనను అనుభవించాడు. ఇక అతడి పనైపోయిందన్నారు.. ఆటకి పనికిరాడని అన్నారు. రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అని తెగ విమర్శలు చేశారు. అన్నీ సైలెంట్‌గా ఉండి భరించాడు. తనకంటూ ఓ రోజు వస్తుందని ఎదురుచూశాడు. ఆ రోజు రానే వచ్చింది. మాటలతో చెబితే కిక్ ఏముంటుందని.. బ్యాట్‌తో సమాధానం చెప్పి తనపై విమర్శలన్నింటికీ చెక్ పెట్టాడు. తనను విమర్శించిన వారిచేతే మెచ్చుకునేలా చేసుకున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదరగొడుతున్న విరాట్ పుట్టినరోజు నేడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. అతడిపై తమ అభిమానాన్ని వినూత్న రూపాల్లో చాటుకుంటున్నారు.
హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ భారీ కటౌట్.. స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్లో.. - విరాట్ కోహ్లీ బర్త్‌డే హైదరాబాద్ భారీ కటౌట్
టీమ్ఇండియా పరుగుల రారాజు విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఏకంగా భారీ కటౌట్లను ఏర్పాటు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ కూడా కొట్టక చాలా మాటలు పడ్డాడు కోహ్లీ. సర్వత్రా విమర్శలు.. ఉచిత సలహాలు.. జట్టుకు భారం అనే మాటలు.. ఇలా మానసికంగా వేదనను అనుభవించాడు. ఇక అతడి పనైపోయిందన్నారు.. ఆటకి పనికిరాడని అన్నారు. రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్ అని తెగ విమర్శలు చేశారు. అన్నీ సైలెంట్‌గా ఉండి భరించాడు. తనకంటూ ఓ రోజు వస్తుందని ఎదురుచూశాడు. ఆ రోజు రానే వచ్చింది. మాటలతో చెబితే కిక్ ఏముంటుందని.. బ్యాట్‌తో సమాధానం చెప్పి తనపై విమర్శలన్నింటికీ చెక్ పెట్టాడు. తనను విమర్శించిన వారిచేతే మెచ్చుకునేలా చేసుకున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదరగొడుతున్న విరాట్ పుట్టినరోజు నేడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. అతడిపై తమ అభిమానాన్ని వినూత్న రూపాల్లో చాటుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విరాట్ బర్త్తే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇక్కడి అభిమానులు తమ అభిమానం దేశానికి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. విషయం తెలిసిందే. సాధారణంగా ఇక్కడ తెలుగు స్టార్ హీరోల కటౌట్స్ మాత్రమే పెడుతుంటారు. ఇప్పుడు అదే ప్లేస్‌లో కోహ్లీ నిలిచి.. తొలి క్రికెటర్‌గా ఈ ఘనత సాధించాడు. ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. విజయవాడలోనూ 40 అడుగుల కోహ్లీ కటౌట్, ముంబయిలో ఓ భారీ గోడపై కోహ్లీ పెయింట్ వేసి వీర లెవెల్లో గీశారు. ప్రస్తుతం ఈ ఫొటోలన్నీ తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విరాట్ బర్త్తే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇక్కడి అభిమానులు తమ అభిమానం దేశానికి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. విషయం తెలిసిందే. సాధారణంగా ఇక్కడ తెలుగు స్టార్ హీరోల కటౌట్స్ మాత్రమే పెడుతుంటారు. ఇప్పుడు అదే ప్లేస్‌లో కోహ్లీ నిలిచి.. తొలి క్రికెటర్‌గా ఈ ఘనత సాధించాడు. ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. విజయవాడలోనూ 40 అడుగుల కోహ్లీ కటౌట్, ముంబయిలో ఓ భారీ గోడపై కోహ్లీ పెయింట్ వేసి వీర లెవెల్లో గీశారు. ప్రస్తుతం ఈ ఫొటోలన్నీ తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇదీ చూడండి:T20 worldcup: మళ్లీ అంపైరింగ్ పొరపాటు.. ఈసారి ఆ విషయంలో