తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైట్​బాల్ క్రికెట్​లో కోహ్లీ రికార్డు.. టీ20ల్లో ఈ ఏడాది ఛాంపియన్ అతడే.. - విరాట్ కోహ్లీ రికార్డులు

Ind vs Aus 3rd T20 : ఆస్ట్రేలియాతో ఆఖరి మ్యాచ్​ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. అయితే హైదరాబాద్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్​ పలు రికార్డులు నమోదు చేశారు. అవి ఏంటంటే..

virat kohli surya kumar yadav
virat kohli surya kumar yadav

By

Published : Sep 26, 2022, 12:32 PM IST

Ind vs Aus 3rd T20 : మొదటి టీ20 సొంత తప్పిదాలతో ఓడిపోయారు. రెండో మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న సందిగ్ధం ఏర్పడింది. దీంతో 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్​లో విజయం సాధించారు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే. ఈ గెలుపు ఓటములుపై చర్చకు తెరపడలేదు. మెగా టోర్నీ ముందు చిన్న తప్పును కూడా భూతద్దంలో వెతికి మరీ విమర్శించిన వారు ఉన్నారు. ఏది ఎలాగున్నా.. సిరీస్ డిసైడర్​ మ్యాచ్​లో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్​ను ​కైవసం చేసుకుంది. గత తప్పుల నుంచి నేర్చుకుని టీమ్​ ఇండియా మంచి ప్రదర్శన చేసింది. అదే కాకుండా ఈ సిరీస్​ డిసైడర్​ మ్యాచ్..​ అనేక రికార్డులకూ వేదికైంది.

భారత్​-ఆసీస్ మొదటి ఇన్నింగ్స్​లో అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన చేసి మూడు వికెట్లు తీశాడు. అతడికి తోడు జస్​ప్రీత్​ బుమ్రా.. ఆసీస్ బౌలర్లను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్​లో.. ఓపెనర్లు ఇద్దరు ఔట్​ అయినా.. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. కోహ్లీ 63(48), సూర్య 69(36) బాదారు.

టీ20 ఛాంపియన్ సూర్య..
2022లో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్​ నిలిచాడు. ఈ ఏడాది ఆడిన 20 మ్యాచ్​ల్లో 37.88 సగటుతో 682 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధికంగా 117 పరుగులు చేశాడు. మొత్తంగా ఇతడి స్ట్రైక్ రేట్​ 182.84గా ఉంది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో 191.67 స్ట్రైక్ రేట్​తో ఈ 69 పరుగులు చేశాడు. ఇతడి తర్వాతి స్థానాల్లో నేపాల్​కు చెందిన దిపేంద్ర సింగ్ అయిరీ(626), చెక్​ రిపబ్లిక్​కు చెందిన సబవూన్ దవిజి(612), పాకిస్థాన్​ బ్యాటర్ మహ్మద్​ రిజ్వాన్(556), వెస్టీండీస్ బ్యాటర్​ నికోలస్​ పూరన్(553) ఉన్నారు.

కోహ్లీ మరో ఘనత..
అయితే కోహ్లీ తాజాగా చేసిన 63 పరుగులతో.. టీ20, వన్డేల్లో కలిపి 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. మొత్తం 369 మ్యాచ్​ల్లో.. 352 ఇన్నింగ్స్​ల్లో 55.95 సగటుతో ఈ పరుగులు సాధించాడు. అందులో 44 సెంచరీలు, 97 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. ఈ వైట్​బాల్ ఫార్మాట్​లో మొదటగా 16 వేల పరుగులు సాధించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్.

వన్డేల్లో 262 మ్యాచ్​లు ఆడి 57.68 సగటుతో 12,344 పరుగులు చేశాడు. అందులో 64 హాఫ్ సెంచరీలు, 43 సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 183 పరుగులు చేశాడు. టీ20ల్లో 107 మ్యాచ్​లో ఆడి 50.86 సగటుతో 3,660 పరుగులు చేశాడు. అందులో 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసియా కప్​లో ఆఫ్గనిస్థాన్​పై ఒక సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్​లో 122 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు.

ఇవీ చదవండి :'మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా'.. ఏది క్రీడా స్ఫూర్తి?

'హైట్​ ఎక్కువ ఉండడం వల్లే అక్షర్ బాగా​ రాణిస్తున్నాడు'

ABOUT THE AUTHOR

...view details