తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: కోహ్లీకి ఐసీసీ అవార్డు.. కెరీర్‌లోనే తొలిసారి! - kohli T20 worldcup 2022

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీకి ఓ అవార్డు వరించింది. అతడి అద్భుత ప్రదర్శనకు గాను కెరీర్​లో తొలిసారి ఆ అవార్డును అందుకున్నాడు.

kohli icc player of month
కోహ్లీకి అవార్డు.. కెరీర్‌లోనే తొలిసారి

By

Published : Nov 7, 2022, 2:58 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది జనవరిలో ఐసీసీ ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టగా.. విరాట్‌కు తొలిసారి ఈ అవార్డు వరించింది. అక్టోబర్ నెలలో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాలను ఐసీసీ ఈ అవార్డు కోసం నామినేట్ చేసింది. కానీ అభిమానులు మాత్రం విరాట్‌కే ఈ అవార్డును కట్టబెట్టారు.

కలిసొచ్చిన అక్టోబర్.. ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో చెలరేగిన కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రపంచకప్ ప్రారంభమైన అక్టోబరు నెలలో విరాట్​ రెండు అర్ధ సెంచరీలతో 205 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేశాడు.

జట్టును విజయతీరాలకు.. మరోవైపు పెర్త్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చిన డేవిడ్ మిల్లర్.. ఈ అవార్డు కోసం కోహ్లీతో పోటీపడ్డాడు. భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో అక్టోబర్ నెలను ప్రారంభించిన మిల్లర్ మూడు వన్డేల్లో 117 పరుగులు చేశాడు. రెండు టీ20ల్లో 125 పరుగులు చేసిన మిల్లర్.. గువాహటిలో 79 బంతుల్లో 106* అజేయ సెంచరీతో రాణించాడు.

ఇక జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్‌కు నామినేట్ అయ్యాడు. సూపర్-12 రౌండ్-1లో పాకిస్థాన్‌ను మట్టికరిపించడంలో రజా కీలక పాత్ర పోషించాడు. కాగా, ఆగస్టులోనూ ఈ అవార్డు రజాకే దక్కడం గమనార్హం. రజా ఆరు టీ20ల్లో 145 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీశాడు. రజా మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఐర్లాండ్‌పై 82* పరుగులు చేయగా, పాకిస్థాన్‌పై 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి:ఇంగ్లాండ్​తో సెమీస్​ మ్యాచ్​.. ఆ ప్లాన్​ అమలు చేస్తే విజయం మాదే: రోహిత్​

ABOUT THE AUTHOR

...view details