ఐపీఎల్ వాయిదాతో బబుల్ నుంచి ఇంటికి చేరుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇక కరోనాపై పోరాటంలో తనవంతు సాయంగా చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు. రెండో దశ వైరస్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండడం కోసం ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కోహ్లీ, అతని భార్య అనుష్క ఇటీవల వెల్లడించారు.
ఆట ఆగింది.. సాయం మొదలైంది! - ఆగిన ఐపీఎల్.. ఇక దృష్టంతా సాయంపైనే!
కొవిడ్ కేసుల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడింది. దీంతో కరోనాపై పోరాటం చేయడానికి నడుం బిగించాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం శివసేన యువజన విభాగ సభ్యుడు విరాట్‌ను కలిశాడు.

విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
అందులో భాగంగానే టీమ్ఇండియా సారథి కోహ్లీని.. శివసేన యువజన విభాగమైన యువసేన సభ్యుడు రాహుల్ కలిశాడు. "కెప్టెన్‌ను కలిశాను. కొవిడ్ నుంచి ఉపశమనం కోసం అతను మొదలెట్టిన ఉద్యమంపై గౌరవం, ప్రేమ ఉన్నాయి. చెప్పడానికి మాటలేమీ లేవు.. కేవలం గౌరవం మాత్రమే ఉంది. తన ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నా" అని రాహుల్ తెలిపాడు.
ఇదీ చదవండి:ఆర్చరీ ప్రపంచకప్‌కు భారత్ దూరం!