Virat Kohli Test Catches: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. భారతజట్టు తరఫున టెస్టుల్లో 100, అంతకన్నా ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్ల జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకునే అవకాశముంది. ఇందు కోసం.. నేడు దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో కోహ్లీ రెండు క్యాచ్‌లు, రహానె మరో క్యాచ్ అందుకోవాల్సి ఉంది. వీరిద్దరూ ఆ మూడు క్యాచ్‌లు పూర్తి చేస్తే.. చెరో వంద క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లుగా నిలుస్తారు. వీరికన్నా ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఘనత అందుకున్నారు.
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ, రహానె - టీమ్‌ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్
Virat Kohli Test Catches: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. నేడు దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో టెస్టులో ఆ రికార్డును సాధించే అవకాశముంది. ఇంతకీ అదేంటంటే?
ఈ జాబితాలో ప్రస్తుత హెడ్‌కోచ్, మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ (209) క్యాచ్‌లతో అందరికన్నా ముందున్నాడు. తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ (135), సచిన్ తెందూల్కర్ (115), సునీల్ గావస్కర్ (108), మహ్మద్ అజహరుద్దీన్ (105) క్యాచ్‌లతో వరుసగా తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత రహానె (99), కోహ్లీ (98) క్యాచ్‌లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. దీంతో రెండో టెస్టులోనే వీరిద్దరూ ఈ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు టీమ్‌ఇండియా ఇప్పటికే తొలి టెస్టు గెలవడం వల్ల రెండో టెస్టుపైనా కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే.. తొలిసారి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించినట్టవుతుంది.
ఇదీ చూడండి: IND vs SA Virat Kohli: మరో టెస్టు గెలిస్తే.. కోహ్లీ ఖాతాలో 3 రికార్డులు