Virat Kohli and AB de villiers: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు కప్పు సాధించకపోవచ్చు కానీ, ఆ జట్టుకు ఉన్న క్రేజే వేరు. అందుకు ప్రధాన కారణం మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒకటైతే.. మరొకటి మిస్టర్ 360 బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్. ఆధునిక క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన వీరిద్దరు కొన్నేళ్ల పాటు ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకలా నిలిచారు. అయితే, తాజాగా డివిలియర్స్ కోహ్లీ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. మాజీ సారథిపై తన తొలి అభిప్రాయం ఏమిటో వివరించాడు. ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఏబీడీ.. కోహ్లీని తొలిసారి 'కాస్త గడుసరి' ఆటగాడని పేర్కొన్నాడు.
Virat Kohli: కోహ్లీ గడసరి ఆటగాడు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు - ఆర్సీబీ
Virat Kohli and AB de villiers: కోహ్లీని చూసి మొదట కాస్త గడుసరి ఆటగాడని అనుకున్నట్లు ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. క్రికెట్ బాగా ఆడుతున్నా కోహ్లీకి కొంచెం గర్వం, అతివిశ్వాసం ఉన్నట్లు కనిపించాడని చెప్పుకొచ్చాడు.
"మేం ఇద్దరం ప్రత్యేకంగా తొలిసారి కలవడానికి ముందే పలుమార్లు బయట పలకరించుకున్నాం. దాంతో మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పరిచయం ఉంది. మొదట్లో కోహ్లీని చూసి కాస్త గడుసరి ఆటగాడని అనుకున్నా. అదే అతడి గురించి నా తొలి అభిప్రాయం. అయితే, క్రికెట్ బాగా ఆడుతున్నా కోహ్లీకి కొంచెం గర్వం, అతివిశ్వాసం ఉన్నట్లు కనిపించాడు. తొలిసారి మా భేటి కాసేపే జరిగింది. అయినా అప్పుడు నేను ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆ వయసులో క్రికెటర్లు అలాగే ఉండాలని నేను భావించాను. కానీ, ఆర్సీబీకి ఎంపికయ్యాక మేం ఇద్దరం మళ్లీ కలుసుకొని మాట్లాడుకున్నాం. దాంతో మేం బాగా కలిసిపోయాం. అప్పటి నుంచే మా మధ్య అనుబంధం పెరిగింది. స్నేహంగా మారింది. నేనైతే సహజంగా ఎవరితోనూ మాట్లాడను. ఎందుకో కోహ్లీతో బాగా కనెక్ట్ అయ్యా. మా అనుబంధం కొనసాగింది. దీంతో అతడితో ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటున్నా. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు ఒకేలా ఉంటాయి. మేం క్రికెట్ ఆడే విధానం కూడా ఒకలాగే ఉంటుంది" అని డివిలియర్స్ వివరించాడు.
ఇదీ చూడండి :కోహ్లీతో మాట్లాడాక ఆత్మవిశ్వాసం పెరిగింది: అండర్-19 కెప్టెన్