Virat Kohli 500 : ఈ తరం క్రికెట్ లవర్స్‌కు విరాట్ కోహ్లీ అనేది ఓ పేరు కాదు ఓ ఎమెషన్. అతను క్రీజులోకి దిగాడంటే ఇక స్టేడియం మొత్తం కోహ్లీ పేరుతో మారుమోగిపోవాల్సిందే. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్న ఈ రన్నింగ్ మెషిన్ బరిలోకి దిగాడంటే ఇక బాల్‌ను అలవోకగా బౌండరీని దాటిస్తాడు. అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్‌లోకి అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. ఆ తర్వాత ఆడిన అన్నీ ఫార్మాట్లలో అదరగొట్టాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు సారధ్యం వహించిన .. అక్కడ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఆడుతూ వస్తున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్లో కూడా మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఈతరం ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడిన కింగ్ కోహ్లీ.. 20 వేలకుపైగా పరుగులు సాధించాడు.
India Vs Westindies : ఇక గురువారం వెస్టిండీస్‌తో తలపడేందుకు క్రీజులో దిగనున్న కింగ్ కోహ్లీ.. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. తాజాగా జరిగిన విండీస్ తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికీ 76 పరుగులతో మంచి ఫామ్‌ను ప్రదర్శించాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా కింగ్ కోహ్లీకి కంగ్రాజ్యూలేషన్స్ చెబుతూ.. టీమ్ఇండియా మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. బీసీసీఐ కూడా ప్రత్యేకంగా పోస్టర్‌ను రూపొందించి ట్విటర్‌లో షేర్ చేసింది.