Virat Kohli 49th Century :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కెరీర్లో అద్భుతమైన మైలురాయి అందుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ (100 పరుగులు ; బంతుల్లో 10x4) శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతడు తన వన్డే కెరీర్లో 49వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సరసన చేరాడు. తన బర్త్ డే రోజున ఈ ఘనత సాధించడం వల్ల విరాట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసం జల్లు కురిపిస్తున్నారు.
సచిన్ తెందూల్కర్ ట్వీట్.. వెల్ ప్లే విరాట్.. " నాకు 49 నుంచి 50 చేరుకోడానికి (వయసును ఉద్దేశిస్తూ) 365 రోజులు పట్టింది. కానీ, నువ్వు త్వరలోనే 49 నుంచి 50కి (వన్డేల్లో సెంచరీలు ఉద్దేశించి) చేరుకొని నా రికార్డు బ్రేక్ చెయ్యాలి" అని తెందూల్కర్ ట్వీట్ చేశాడు.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు
- విరాట్ కోహ్లీ 49 (277 ఇన్నింగ్స్)
- సచిన్ తెందూల్కర్ 49 (452 ఇన్నింగ్స్)
- రోహిత్ శర్మ 31 (251 ఇన్నింగ్స్)
- రికీ పాంటింగ్ 30 (365 ఇన్నింగ్స్)
- సనత్ జయసూర్య 28 (433 ఇన్నింగ్స్)