Virat Kohli 2023 World Cup : త్వరలోనే స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ - 2023 కోసం భారత సెలెక్టర్లు నేడు(సెప్టెంబర్ 5) టీమ్ఇండియా జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేశారు. విరాట్ కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్లకు జట్టులో చోటు లభించింది. ఈ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు తర్వాత విరాట్ కోహ్లీ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే టీమ్ ఇండియా చివరిగా గెలిచిన వన్డే వరల్డ్ కప్(2011) జట్టులో, 2023 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన టీమ్ఇండియా జట్టులో విరాట్ ఒక్కడే కామన్ ప్లేయర్. ఈ విషయాన్ని కోహ్లీ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. ఇక ఇది చూసిన విరాట్ అభిమానులు.. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రపంచకప్ గెలవాలని ఆశిస్తున్నారు. కాగా, ఇప్పటికే మూడు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. 2023 ప్రపంచకప్‌ను టీమ్ఇండియా గెలిస్తే, రెండు వన్డే ప్రపంచ కప్‌లు గెలిచిన మొదటి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డుకెక్కుతాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ క్రికెటర్‌కు ఇది సాధ్యం అవ్వలేదు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతన్న ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి విషయానికొస్తే.. తమ మొదటి మ్యాచ్ పాక్‌పై పేలవ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. మరి తర్వాత జరుగబోయే మ్యాచుల్లో ఎలా ఆడతాడో చూడాలి.