Virat kohli 100: కోహ్లీ వందో టెస్టుకు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు భారత దిగ్గజం సునీల్ గావస్కర్ తెలిపాడు. ఆ ప్రత్యేక మైలురాయి సందర్భంగా స్టాండ్స్‌లో లేచి నిలబడి ప్రేక్షకులు కొట్టే చప్పట్లకు విరాట్ అర్హుడని సన్నీ చెప్పాడు. ఇప్పటికే 98 టెస్టులాడిన కోహ్లీ.. వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో ఈ సిరీస్‌లో చివరిదైన మ్యాచ్ అతనికి 99వ కానుంది. ఇక ఆ తర్వాత సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్‌లో అతను 100వ టెస్టు ఆడనున్నాడు. అది కూడా ఐపీఎల్‌లో అతని సొంతగడ్డ లాంటి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.
'కోహ్లీ వందో టెస్టుకు అలా జరగాలని ఆశిస్తున్నా' - గావస్కర్ విరాట్ కోహ్లీ 100వ టెస్టు
Virat kohli 100: కోహ్లీ వందో టెస్టుకు స్డేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు అన్నాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో చేసే అభినందనలకు విరాట్ అర్హుడని చెప్పాడు.
"కోహ్లీ తర్వాతి టెస్టు కేప్‌టౌన్‌లో ఆడతాడు. వందో మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. సుదీర్ఘ కాలంగా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా పనిచేసిన అతనికి ఇదో అద్భుతమైన అనుభవం కానుంది. ఆ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతిస్తారో? లేదో? చూడాలి. తన 100వ టెస్టులో అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో చేసే అభినందనలకు అతను అర్హుడు" అని గావస్కర్ చెప్పాడు. భారత్ తరపున వంద టెస్టులాడిన 11వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.
ఇదీ చూడండి: మొట్టమొదటి వన్డే మ్యాచ్ ఎప్పుడు జరిగిందో తెలుసా?