Virat Kohli Latest Dance Video : టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు మైదానంలో అల్లరి చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంటాడు. పరుగులతో హడలెత్తించే ఈ ప్లేయర్ అప్పుడప్పుడు మైదానంలో చిందులేస్తూ కూడా ఉంటాడు. డ్యాన్స్‌లు వేస్తూ అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి డ్యాన్సర్ అవతారం ఎత్తాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆట సమయంలో తన డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో ఆడియెన్స్‌ను అలరించాడు.తొలి ఇన్నింగ్స్‌ను టీమ్‌ఇండియా డిక్లేర్ చేశాకా వచ్చిన బ్రేక్ లో కోహ్లీ ఈ స్టెప్పులు వేశాడు. ఓ వైపు బ్రేక్ డ్యాన్స్ చేస్తూ.. చివరిలో మూన్ వాక్ లాంటిది కూడా ట్రై చేశాడు. గిల్ కూడా సింపుల్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. మరోవైపు ఇదే టెస్టులో శుభ్‌మన్ గిల్ కూడా మైదానంలో డ్యాన్స్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు విరాట్, గిల్ డ్యాన్స్ అదరహో అంటూ కామెంట్లు వస్తున్నాయి.
Virat Kohli Dance Video : విరాట్ గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్-విన్ని రామన్ పెళ్లిపార్టీలోనూ కోహ్లీ తన డ్యాన్స్ మూవ్స్‌తో సందడి చేశాడు. 'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా మామా' సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇలా పలు వెడ్డింగ్ ఫంక్షన్స్‌లోనూ టీమ్ మేట్స్‌తో కలిసి ఆడిపాడిన కోహ్లీ.. అక్కడున్న వారిలో ఉత్తేజాన్ని నింపుతుంటాడు.