KL Rahul on Kohli's agression: భారత టాప్ఆర్డర్ బ్యాటర్ కోహ్లీ పేరు వినగానే అతడి దూకుడు స్వభావం గుర్తొస్తుంది. బ్యాటింగ్ అయినా, కెప్టెన్సీ అయినా.. విరాట్ సహజంగానే దూకుడుగా వ్యవహరిస్తాడు. తనను ఎవరైనా కవ్వించేందుకు ప్రయత్నిస్తే.. నోటితో పాటు బ్యాటుతోనూ గట్టిగా సమాధానం చెబుతాడు. తన టీమ్ మెంబర్లను కవ్వించినా.. తనదైన శైలిలో స్పందిస్తాడు. అయితే, కోహ్లీకి ఉన్న కోపమే తన బెస్ట్ ఫ్రెండ్ అని అతడి సహచరుడు కేఎల్ రాహుల్ అంటున్నాడు. విరాట్ లోపల ఒక ఫైర్ ఉందని చెప్పుకొచ్చాడు. క్రికెట్ లాంటి ఆటలు ఆడినప్పుడు ఆ మాత్రం దూకుడు ఉండాలని అభిప్రాయపడ్డాడు. తాను కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని అనుకోలేదని చెప్పుకొచ్చాడు.
Kohli anger kl rahul:"నేను పెరిగే సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలని మాత్రం అనుకోలేదు. విరాట్ కూడా ఇదే చెప్పాడు. అతడి కోపమే విరాట్‌కు బెస్ట్ ఫ్రెండ్. ఆ కోపాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. సరైన ఫలితం వచ్చేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ లేకపోతే క్రికెట్ ఆడలేం. జీవితంలో మరే ఇతర పని చేయలేం" అని ఓ ప్రముఖ యూట్యూబ్ షోలో రాహుల్ చెప్పుకొచ్చాడు.