టీ20 ఫార్మాట్ అంటేనే దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాలి. అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌ను కొనసాగించాలి. తాజాగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభవుతుంది. రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అయితే కివీస్ మాత్రం తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాయకత్వంలోనే బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో సీనియర్లు రోహిత్, విరాట్, కేన్ గురించి న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ లూక్ రాంచీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి బెరుకు లేకుండా ఆడే యువ ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు వీరు ముగ్గురూ ఇంకా కష్టపడాల్సి ఉందని పేర్కొన్నాడు.
'యువ ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు రోహిత్, కోహ్లీ ఇంకా కష్టపడాలి' - టీ20 ఫార్మాట్‌పై కివీస్ బ్యాటింగ్ కోచ్ కామెంట్స్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో కివీస్ బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రాంచీ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
"టీ20ల్లో మార్పు చెందడం చాలా కష్టంతో కూడుకున్నదే. అయితే రోహిత్, విరాట్, కేన్ మాత్రం యువకులతో పోటీ పడేందుకు ఎల్లవేళలా కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఇంకా ఎక్కువగా కృషి చేయాలి. జట్టులో యువకులతో పాటు అనుభవజ్ఞులు ఉండటం వల్ల ఒకరికొకరు ఆలోచనలను పంచుకొనే వీలు కలుగుతుంది. అయితే టీ20 ఫార్మాట్ అంటే కేవలం బాదేయడమే కాదు. ఒక్కోసారి పిచ్ పరిస్థితులు ఆటపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సరైన వ్యూహంతోనే ముందుకు వెళ్లాలి. ప్రతి మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడేద్దామంటే కుదరదు. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. మ్యాచ్, పిచ్ పరిస్థితులను బట్టి ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిగిన పొట్టి కప్‌లో ఆడిన పిచ్‌లు డిఫరెంట్‌గా ఉన్నాయి" అని విశ్లేషించాడు.