తెలంగాణ

telangana

vijay Hazare Trophy 2021: హైదరాబాద్​ జోరు.. ఆంధ్రకు రెండో ఓటమి

By

Published : Dec 10, 2021, 7:22 AM IST

Updated : Dec 10, 2021, 9:19 AM IST

vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకోగా.. జరిగిన రెండు మ్యాచ్​ల్లోనూ ఆంధ్ర ఓటమిపాలైంది. గురువారం జరిగిన మ్యాచ్​ల్లో దిల్లీపై హైదరాబాద్ విజయం అందుకోగా.. విదర్భ చేతిలో ఆంధ్ర పరాజయంపాలైంది.

vijay hazare trophy Andhra, vijay hazare trophy Hyderabad, విజయ్ హజారే ట్రోఫీ హైదరాబాద్, విజయ్ హజారే ట్రోఫీ ఆంధ్ర
vijay hazare trophy

Vijay Hazare Trophy Hyderabad: తిలక్‌వర్మ (139; 123 బంతుల్లో 7×4, 8×6), చందన్‌ సహాని (87; 74 బంతుల్లో 5×4, 7×6) వీరవిహారం చేయడం వల్ల విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూపు-సి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 79 పరుగుల ఆధిక్యంతో దిల్లీపై గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 325 పరుగులు సాధించింది. తిలక్‌, చందన్‌లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 152 పరుగులు జోడించారు. బదులుగా దిల్లీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరుగులే చేయగలిగింది. హిమ్మత్‌సింగ్‌ (47) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ (3/33), కార్తికేయ (2/28), సి.వి.మిలింద్‌ (2/58), రవితేజ (1/61), మిఖిల్‌ (1/38) మెరిశారు.

ఆంధ్రకు మరో ఓటమి

Vijay Hazare Trophy Andhra: ఈ టోర్నీలో ఆంధ్రకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో విదర్భ 8 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు సాధించింది. జ్ఞానేశ్వర్‌ (93; 126 బంతుల్లో 7×4), అంబటి రాయుడు (53; 49 బంతుల్లో 2×4, 3×6), తపస్వి (45; 25 బంతుల్లో 6×4) మెరిశారు. అనంతరం విదర్భ 41.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 288 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అథర్వ (164 నాటౌట్‌; 123 బంతుల్లో 15×4, 5×6) అజేయ శతకంతో ఆంధ్రకు మ్యాచ్‌ను దూరం చేశాడు.

ఇవీ చూడండి: 'కెప్టెన్సీ రికార్డుని బట్టి ఆటగాడి విలువను చెప్పలేం'

Last Updated : Dec 10, 2021, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details