తమను ఆదుకోవాలంటూ బీసీసీఐ(BCCI) అధ్యక్షుడు గంగూలీకి(Ganguly) మెయిల్ ద్వారా ఓ వినతి పత్రాన్ని అందించారు బోర్డుకు చెందిన మాజీ స్కోరర్లు. పదవీ విరమణ ప్రయోజనాలు, వయసు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Ganguly: 'దాదా.. మాకు ప్రయోజనాలు కల్పించాలి' - Veteran BCCI scorers
ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న తమకు ప్రయోజనం కల్పించాలని బీసీసీఐ మాజీ స్కోరర్లు, బోర్డు అధ్యక్షుడు గంగూలీకి విజ్ఞప్తి చేశారు. మొత్తంగా 17మంది స్కోరర్లు, మెయిల్ ద్వారా తమ వినతి పత్రాన్ని అందించారు.
దాదా
ముంబయి క్రికెట్ అసోసియేషన్ స్కోరర్ వివేక్ గుప్తా ఆధ్వర్యంలో మొత్తంగా 17మంది స్కోరర్లు కలిసి ఈ ప్రతిపాదనను దాదా ముందు ఉంచారు. కరోనా కాలంలో చాలామంది వర్ధమాన, ప్రస్తుత స్కోరర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి T20 WC: ఐసీసీని గడువు కోరనున్న బీసీసీఐ!
Last Updated : Jun 3, 2021, 7:07 PM IST