తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వారు దూరమయ్యారు' - 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. అయినా వారు దూరమయ్యారు'

కొవిడ్​ మహమ్మారి కారణంగా తన అమ్మను, అక్కను కోల్పోయిన భారత మహిళా క్రికెటర్​ వేద కృష్ణమూర్తి.. వాళ్లు లేకపోవడం వల్ల తన హృదయం ముక్కలవుతుందని భావోద్వేగానికి గురైంది. వాళ్లతో చివరి రోజుల్లో సంతోషంగా గడిపానని వెల్లడించింది. కానీ అవే ఆఖరి క్షణాలు అవుతాయని అనుకోలేదని తెలిపింది వేద.

vedaveda-krishnamurthy-on-losing-mother-sister-did-everything-right-but-covid-19-found-its-way
veda'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వారు దూరమయ్యారు'

By

Published : May 11, 2021, 8:47 AM IST

నవ్వుతూ సంతోషంగా గడిపిన భారత మహిళా క్రికెటర్​ వేద కృష్ణమూర్తి కుటుంబంలో ఇప్పుడు విషాదం నిండుకుంది. రెండు వారాల్లోనే ఆమె తల్లిని, అక్కను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. మొదట తన తల్లి చెలువంబా దేవిని కోల్పోయిన ఆమె.. రెండు వారాల వ్యవధిలోనే అక్క వత్సలను దూరం చేసుకుంది. వాళ్లు తనతో లేకపోవడం వల్ల తన హృదయం ముక్కలవుతుందంటూ వేద తన భావోద్వేగాన్ని బయట పెట్టింది.

"ఈ వైరస్​ చాలా ప్రమాదమైంది. నా కుటుంబం అంతా సరిగ్గానే చేసినా ఈ వైరస్ తన మార్గాన్ని వెతుక్కొని వచ్చింది. నా లాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ల గురించి ఆలోచిస్తే బాధ కలుగుతోంది. అమ్మ, అక్క.. మీరిద్దరూ నన్ను వదిలి వెళ్లిపోవడం వల్ల నా ప్రపంచం తలకిందులైంది. మళ్లీ ఓ కుటుంబంగా మేం తిరిగి ఎలా కలవగలమో తెలియట్లేదు. మీ ఇద్దరిని ఎంతో ప్రేమిస్తున్నానని, మిమ్మల్ని మిస్​ అవుతున్నానని మాత్రమే చెప్పగలను. అందమైన అమ్మ, అక్క.. ఇంట్లోని మేమందరం గత కొన్ని రోజులుగా దుఃఖంలో మునిగిపోయాం. మన ఇంటికి మీ ఇద్దరే పునాది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. మీరు నాతో లేరని తెలిసి నా హృదయం ముక్కలవుతోంది. అమ్మా.. నువ్వు నన్ను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దావు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో నేర్పావు. ఆ లక్షణాన్ని నాకు అందించింది కచ్చితంగా నువ్వే. నాకెప్పటికీ తెలిసిన అందమైన, ఆనందమైన, నిస్వార్థమైన వ్యక్తివి నువ్వే. అక్కా.. నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తిని నేనే అని నాకు తెలుసు. నువ్వో యోధురాలివి. చివరి నిమిషం వరకూ పోరాడేలా నాకు స్ఫూర్తిమనిచ్చావు. నేను చేసిన ప్రతి పనిలో, చెప్పిన ప్రతి మాటలో మీరిద్దరూ ఆనందాన్ని వెతికారు. నాకు ఇద్దరు తల్లులనే అహం ఉండేది. కానీ అది ఎవరికైనా మంచిది కాదని ఇప్పుడు తెలుస్తోంది. మీతో చివరి రోజులను ఎంతో సంతోషంగా గడిపా. కానీ అవే ఆఖరి క్షణాలు అవుతాయని అనుకోలేదు" అని 28 ఏళ్ల వేద పేర్కొంది.

ఇదీ చదవండి:'ఆ సమయంలో కారణం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి'

ABOUT THE AUTHOR

...view details