Vanitha Retirement: భారత జట్టు మహిళా క్రికెటర్ వీఆర్ వనిత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 31ఏళ్ల వనిత తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాతో తన ప్రయాణం గురించి ట్వీట్ చేసింది. ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
19ఏళ్ల క్రితం ఆటను మొదలు పెట్టినప్పుడు నేను చిన్న అమ్మాయిని. నేటికీ క్రికెట్‌పై నా ప్రేమ అలాగే ఉంది. అయితే దిశ మారుతోంది. నా మనసు ఆట కొనసాగించమని చెప్పగా.. శరీరం వద్దని చెబుతోంది. నేను రెండోది వినాలని నిర్ణయించుకున్నాను. అందుకే అన్ని క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇది పోరాటాలు, సంతోషం, ఇబ్బందులు, అభ్యాసాలతో కూడుకున్న ప్రయాణం. కొన్నింటికి పశ్చాత్తాప పడుతున్నప్పటికీ.. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు ధన్యురాలిని" అని వనిత పోస్ట్‌లో పేర్కొన్నారు.