తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్​గా రిషబ్ పంత్ - రిషబ్ పంత్ బ్రాండ్ అంబాసిడర్

Pant as Brand Ambassador: టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్​ను రాష్ట్ర అంబాసిడర్​గా నియమించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు.

rishabh pant brand ambassador, rishabh pant uttarakhand, పంత్ బ్రాండ్ అంబాసిడర్, పంత్ ఉత్తరాఖండ్
rishabh pant

By

Published : Dec 20, 2021, 9:52 AM IST

Pant as Brand Ambassador: టీమ్ఇండియా యువ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్​ను రాష్ట్ర అంబాసిడర్​గా నియమించింది ఉత్తరాఖండ్. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యువతను క్రీడలు, ప్రజారోగ్యం వైపు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు పంత్.

స్వయంగా పంత్​కు వీడియోకాల్ చేసిన ముఖ్యమంత్రి మొదట అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని తెలిపారు. దీనిపై స్పందించిన పంత్.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల్లో క్రీడలు, ఫిట్​నెస్​పై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపాడు.

ఇటీవల న్యూజిలాండ్​తో జరిగిన టీ20 సిరీస్​లో చివరిసారిగా ఆడాడు పంత్. ఈ సిరీస్​ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం అతడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఇరుజట్ల మధ్య ఈనెల 26న తొలి టెస్టు జరగనుంది.

ఇవీ చూడండి: U19 World Cup Squad: భారత యువ జట్టులో తెలుగుతేజాలు

ABOUT THE AUTHOR

...view details