తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​కు ఆడాలనుకుని.. ప్రత్యర్థిగా బరిలోకి! - టీ20 ప్రపంచ కప్​లో అమెరికా

Unmukt Chand USA: భారత్​ తరఫున అంతర్జాతీయ క్రికెట్​ ఆడాలని కలలు కన్న అండర్​-19 మాజీ కెప్టెన్​ ఉన్ముక్త్​ చంద్​ త్వరలోనే సొంత జట్టుపై ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. 2024 టీ20 ప్రపంచకప్​కు యూఎస్​ఏ అర్హత సాధించటం వల్ల ఆ దేశం తరఫున ఆడుతున్న ఉన్ముక్త్​కు ఈ అవకాశం దక్కనుంది. ఉన్ముక్త్​తో పాటు మరికొంత మంది స్వదేశంపై బరిలో దిగనున్నారు.

Unmukt chand
ఉన్ముక్త్​ చంద్​

By

Published : Apr 13, 2022, 8:58 AM IST

Unmukt Chand USA: టీమిండియా అండర్​-19 మాజీ కెప్టెన్​ ఉన్ముక్త్​ చంద్​.. సగటు క్రికెట్​ అభిమానులకు గుర్తుండిపోయే క్రికెటర్​. 2012 అండర్​ 19 ప్రపంచకప్​లో భారత్​ను జగజ్జేతగా నిలిపిన యువ సారథి. అయితే.. అనూహ్యంగా 28 ఏళ్లకే భారత క్రికెట్​కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న ఉన్ముక్త్​.. ఇప్పుడు భారత జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశాన్ని సొంతం చేసుకోనున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్​ ఆతిథ్య హక్కులను వెస్టిండిస్​తో పాటు అమెరికా సైతం దక్కించుకుంది. దీంతో యూఎస్​ఏ జాతీయ జట్టుతో కొనసాగుతున్న ఉన్ముక్త్​కు ఈ అరుదైన అవకాశం దక్కనుంది.

2024 టీ20 ప్రపంచ కప్​ టోర్నీని వెస్టిండిస్​తో పాటు అమెరికాలోనూ నిర్వహించాలని నిర్ణయించింది ఐసీసీ. క్రికెట్​కు విశ్వవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణం తీసుకున్నట్లు వెల్లడించింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో హోస్ట్​ కంట్రీ హోదాలో యూఎస్​ఏ తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించింది. దీంతో ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్న ఉన్ముక్త్​.. టీమిండియాకు ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

స్వదేశంపై బరిలో మరికొంత మంది: టీమిండియా అండర్​ 19 మాజీ సారథి ఉన్ముక్త్​తో పాటు తమ సొంత జట్లపై ప్రత్యర్థి హోదాలో బరిలోకి దిగనున్నారు పలువురు క్రికెటర్లు. అందులో ప్రస్తుతం యూఎస్​ఏ తరఫున క్రికెట్​ ఆడుతున్న కోరే అండర్సన్​(న్యూజిలాండ్​), లియామ్​ ప్లంకెట్​(ఇంగ్లాండ్​), జుయాన్​ థెరాన్​(దక్షిణాఫ్రికా), సమీ అస్లాం(పాకిస్థాన్​)లు ఉన్నారు. ​

ఇదీ చూడండి:28 ఏళ్లకే వరల్డ్​కప్​ విన్నర్ రిటైర్మెంట్

బిగ్​ బాష్​ లీగ్​లో ఉన్ముక్త్.. తొలి భారత ఆటగాడిగా!

ABOUT THE AUTHOR

...view details