Under-19 Worldcup Australia Vs Afghanisthan: అండర్-19 ప్రపంచకప్లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండు వికెట్లు తేడాతో గెలుపొందింది. విజయంలో భారత సంతతికి చెందిన కుర్రాడు, నివేథన్ రాధాకృష్ణన్ కీలకంగా వ్యవహరించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.
202 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్.. 49.1ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ కాంప్బెల్ కెలావే(51), నివేథన్ రాధాకృష్ణన్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా.. మిగతా వారు విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఖరోతే 3, నూర్ అహ్మద్, షాహిద్ఉల్లా హసాని తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.