SC cricket age cut off: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లలో అర్హత వయసును నిర్ధరించే కటాఫ్ డేట్‌ను మార్చాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై బీసీసీఐకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అభ్యర్థించారు. అయితే, వీటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఇవన్నీ బీసీసీఐ పరిశీలించిన అంశాలని ఎస్ఏ నజీర్, పీఎస్ నరసింహలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. 'ఈ పిటిషన్‌ను మేం ఆమోదించలేం. ఇవన్నీ మా చేతిలో ఉండవు. పిటిషన్‌ను వెనక్కి తీసుకోండి. అయినా, మాకు క్రికెట్ గురించి అవగాహన లేదు. వీటిని మేం పరిశీలించలేం' అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై నిర్ణయం తీసుకోగలిగే అధికారులను కలవాలని సూచించింది.
సెలక్షన్‌పై సుప్రీంలో క్రికెటర్ వ్యాజ్యం.. మాకేం తెలీదన్న జడ్జి! - అండర్ 19 క్రికెటర్ రిత్విక్ ఆదిత్య
Cricket cut off age SC: దేశవాళీ టోర్నీలలో వయసు నిర్ధరణకు ప్రస్తుతం పరిగణిస్తున్న కటాఫ్ తేదీని మార్చాలని ఓ అండర్ 19 క్రికెటర్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం.. సంబంధిత అధికారులను కలవాలని సూచించింది.
19 ఏళ్ల లోపు వయసు ఉన్న రిత్విక్ ఆదిత్య అనే క్రికెటర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చి/ఏప్రిల్‌లో ప్రచురితమైన ఓ అడ్వర్టైజ్మెంట్కు వ్యతిరేకంగా ఈ పిటిషన్ వేశారు. నిర్దిష్ట వయసు ఉన్న క్రికెటర్లతో గ్రూపుల వారిగా నిర్వహించే టోర్నీల కోసం.. బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య పుట్టినవారికి పోటీలో పాల్గొనేందుకు అర్హత లేదని, సెప్టెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య జన్మించినవారికే అనుమతి ఉంటుందని పేర్కొంది. అయితే, వయసు నిర్ధరించేందుకు తీసుకున్న కటాఫ్ డేట్.. 12 నెలలకు బదులుగా ఏడు నెలలు మాత్రమే ఉంటోందని పిటిషనర్ వాదించారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 1ని కటాఫ్ తేదీగా తీసుకునేలా బీసీసీఐని ఆదేశించాలని సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అయితే, సుప్రీం తోసిపుచ్చిన నేపథ్యంలో.. పిటిషనర్ తరఫు న్యాయవాది వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఇదీ చదవండి: