తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగ్లాతో టెస్ట్ సిరీస్​.. షమీ స్థానంలోకి అతడు.. 12ఏళ్ల తర్వాత ఛాన్స్​!

బంగ్లాతో టెస్ట్ సిరీస్​కు షమీ స్థానంలోకి ఆ ప్లేయర్​కు అవకాశమిచ్చింది బీసీసీఐ. దీంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు.

Unadkat replaces Shami for India vs Bangladesh Tests
బంగ్లాతో టెస్ట్ సిరీస్​.. షమీ స్థానంలోకి అతడు.. 12ఏళ్ల తర్వాత ఛాన్స్​!

By

Published : Dec 10, 2022, 12:55 PM IST

బంగ్లాదేశ్‌ పర్యటనకు ముందు గాయపడిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇంకా కోలుకోలేదు. దీంతో అతడి స్థానంలో ఎవరిని ఆడిస్తారా? అని పెద్ద చర్చే సాగింది.ఉమ్రాన్ మాలిక్ , ముకేశ్ కుమార్ చౌదరి , నవ్​దీప్​ సైనీ.. ఇలా వీరిలో ఎవరికైనా అవకాశం దక్కొచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జయ్‌దేవ్ ఉనద్కత్​కి టెస్టు టీమ్‌లో చోటు కల్పించింది బీసీసీఐ. దాదాపు ప‌న్నెండేళ్ల త‌ర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి పిలుపు వ‌చ్చింది. బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు మ్యాచ్‌లో అత‌ను ఆడ‌నున్నాడు. బౌల‌ర్ ష‌మీ గాయ‌ప‌డ‌డంతో.. అత‌ని స్థానంలో ఉన‌ద్క‌త్‌ను తీసుకున్నారు. ఇటీవ‌ల విజ‌య హ‌జారే ట్రోఫీ విజ‌యంలో సౌరాష్ట్ర త‌ర‌పున అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు జ‌య‌దేవ్‌. దీంతో అతడికి అవకాశం దక్కింది.

కాగా, 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్. ఆ మ్యాచ్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు జయ్‌దేవ్. ఆ తర్వాత మళ్లీ ఈ సౌరాష్ట్ర కుర్రాడికి అవకాశం దక్కలేదు. 2013లో వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన అతడు.. 2016లో టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఘనమైన రికార్డులు క్రియేట్ చేసిన జయ్‌దేవ్ టీమ్​ఇండియా తరుపున అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు.

అయితే ఇటవలే విజయ్ హాజారే ట్రోఫీలో 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జయ్‌దేవ్ ఉనద్కట్, కెప్టె న్‌గా సౌరాష్ట్రకు టైటిల్ అందించాడు. ఇక తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 86 మ్యాచులు ఆడి 311 వికెట్లు తీశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఆడాడు. 2022 సీజన్‌లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఇదీ చూడండి:Ball tampering: వార్నర్​ను అలా చేయమని చెప్పింది​ క్రికెట్​ ఆస్ట్రేలియానా?

ABOUT THE AUTHOR

...view details