Zaheer khan Umran Malik: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమ్‌ఇండియా యువపేసర్ ఉమ్రాన్ మాలిక్ ఫామ్ హాట్ టాపిక్‌గా మారింది. తన తొలి ఐదు ఓవర్లలోనే దాదాపు 150 కి.మీ వేగాన్ని అందుకుంటూ వేసిన బంతులు కివీస్ బ్యాటర్లను ఇరుకున పెట్టాయి. ఉమ్రాన్ ధాటికి డెవన్ కాన్వే, డెరిల్ మిచెల్ వంటి కీలక ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరారు. తాజాగా టీమ్‌ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఈ ఆటగాడి ప్రతిభను కొనియాడాడు. అయితే, ఇది అతడి అరంగేట్ర మ్యాచ్ కావడం వల్ల పరుగుల్లో అతడి స్కోర్‌ను అంతగా పట్టించుకోవద్దని.. పేస్ పరంగా మరింత మెరుగయ్యే అవకాశాలు ఇవ్వాలని సూచించాడు.
'ఉమ్రాన్.. పేస్‌ను వదలొద్దు.. జోరు పెంచాల్సిందే!' - umran malik team india
టీమ్‌ఇండియా యువపేసర్ ఉమ్రాన్ మాలిక్ గురించి మాజీ ప్లేయర్ జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతడి ఆటను కొనియాడుతూ పలు సూచనలు చేశారు.
"అతడు ఆటను గొప్పగా ప్రారంభించాడు. బౌలింగ్‌లో అతడి వేగమే ఉమ్రాన్‌కు అతిపెద్ద బలం. అయితే చివరి 5 ఓవర్ల విషయంలో మరింత సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఇది అతడికి తొలి మ్యాచ్ మాత్రమే. ఈ ఫార్మాట్‌లో అడుగుపెట్టడం, మ్యాచ్‌ను అర్థం చేసుకుని ఆస్వాదించడం వంటివెన్నో ఉంటాయి. కానీ, అరంగేట్ర ఆటగాడిగా చూస్తే మాత్రం ఉమ్రాన్ గొప్ప ప్రదర్శన చేశాడనే చెప్పాలి. అతడు చేసిన పరుగుల కన్నా కూడా పేస్, వికెట్ తీసే సామర్థ్యాన్ని ఎక్కువగా గుర్తించాలి. ఆటపై మంచి నియంత్రణ చూపాడు. అతడి శక్తిని తిరిగి తెచ్చుకోవాలి. వీలైనంత వేగంగా బంతులను సంధించాలి" అంటూ జహీర్ ఖాన్ తెలిపాడు.