Umran malik: ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వేగంతో బౌలింగ్ చేసి సంచలన ప్రదర్శన చేసిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ సైతం అతడి బౌలింగ్‌పై స్పందిస్తూ.. అచ్చం పాక్ దిగ్గజం వకార్ యూనిస్ బౌలింగ్‌ను గుర్తుచేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అయితే, తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఉమ్రాన్.. తాను వకార్‌ను అనుసరించలేదని స్పష్టం చేశాడు.
వకార్ కాదు.. వారే నాకు స్ఫూర్తి: ఉమ్రాన్ మాలిక్ - ఉమ్రాన్‌కు వారే స్ఫూర్తి
Umran Malik: బుమ్రా, షమి, భువనేశ్వర్ కుమార్‌లే తనకు స్ఫూర్తి అని అన్నాడు జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్. చిన్నప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ఆడుతూ ఈ ముగ్గురి బౌలింగ్ చూస్తూనే పెరిగినట్లు తెలిపాడు.
"నా బౌలింగ్ యాక్షన్ సహజసిద్ధమైనది. నేనెప్పుడూ వకార్‌ను అనుకరించలేదు. నాకు బుమ్రా, షమి, భువనేశ్వర్ కుమార్‌లే స్ఫూర్తి. నేను చిన్నప్పటి నుంచి వివిధ స్థాయిల్లో ఆడుతూ ఈ ముగ్గురి బౌలింగ్ చూస్తూనే పెరిగాను. ఇప్పుడు నేను టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడంపై ఉప్పొంగిపోవడం లేదు. జరిగేది ఉంటే కచ్చితంగా జరుగుతుంది. దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు దేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. అక్కడ నేను అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నా. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు గెలవడమే నా లక్ష్యం. నేను అద్భుతంగా రాణించి ఒంటి చేత్తో టీమ్‌ఇండియాను గెలిపించాలనుకుంటున్నా" అని మాలిక్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: సిరాజ్ వల్లే అతనితో గొడవ జరిగింది: రియాన్ పరాగ్