ఆస్ట్రేలియా పాతతరం ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన బ్రెట్‌లీ టీ20 ప్రపంచకప్ జట్ల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక ఆటగాళ్లను భారత్, ఆస్ట్రేలియాలు పక్కన పెట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు.
"ఉమ్రాన్ మాలిక్‌ను భారత జట్టు ఎంపిక చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ సిరీస్‌లో అతడు ఆడితే చూడాలనుకున్నాను. అతడు కచ్చితంగా ఈ టోర్నీ ఆడాల్సినవాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో కామెరూన్ గ్రీన్‌కు ఎందుకు చోటుదక్కలేదో నాకు అర్థం కావడం లేదు" అని ఈ లెజెండరీ మాజీ ఆటగాడు వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియా పిచ్‌ల గురించి మాట్లాడుతూ.. ఆటలో పేస్, బౌన్స్ రెండూ కీలకమే. వాటిని ఎంత సమర్థంగా వినియోగించుకుంటామనేది ఆటగాడి మీదనే ఆధారపడి ఉంటుందని తెలిపాడు. అయితే ఆసియా ఖండం నుంచి వచ్చే బ్యాట్స్‌మెన్‌లకు అదనపు బౌన్స్ ఉన్న పిచ్‌లపై ఆడిన అనుభవం తక్కువగా ఉంటుందని గుర్తుచేశాడు.