Funny Umpire Calls: అంపైరింగ్ అనేది చాలా కఠినమైన పని. సెకండ్లలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వైడ్, ఎల్బీడబ్ల్యూ, నోబాల్.. ఇలా ఏ నిర్ణయమైనా కచ్చితత్వంతో ఉండాల్సిందే. లేదంటే మ్యాచ్ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అనాలోచిత డెసిషన్స్‌తో కొందరు అంపైర్లు వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు అద్భుతమైన నిర్ణయాలతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తారు. మరికొందరైతే ఫన్నీ హావభావాలు, విచిత్రమైన విన్యాసాలతో నిర్ణయాలను ప్రకటిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటారు. అలాంటి కోవకే చెందుతారు ఈ అంపైర్.
అంపైర్లందు ఈ అంపైర్ వేరయా.. వైడ్ సిగ్నల్ ఇలా కూడా ఇవ్వొచ్చా! - funny umpire sayings
Funny Umpire Calls: సాధారణంగా క్రికెట్లో వైడ్ సిగ్నల్‌ను రెండు చేతులు చాచి ఇస్తుంటారు అంపైర్లు. కానీ ఈ అంపైర్ ఏకంగా శీర్షాసనం వేసి మరీ సిగ్నల్ ఇవ్వడం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టంట వైరల్‌గా మారింది.
Umpiring
మహారాష్ట్ర స్థానిక క్రికెట్ టోర్నమెంట్ పురందర్ ప్రీమియర్ లీగ్‌లో ఓ అంపైర్ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు కారణం సాధారణంగా వైడ్ సిగ్నల్‌ను అంపైర్లు రెండు చేతులు చాచి ఇస్తుంటారు. కానీ ఈ అంపైర్ శీర్షాసనం వేసి మరీ రెండు కాళ్లు చాచి వైడ్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆ అంపైర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఇదెంతో ఇన్నోవేటివ్‌గా ఉందని కొనియాడుతున్నారు. మరి అంతగా వైరల్‌గా మారిన ఆ అంపైర్ సిగ్నల్‌ను మీరూ చూసేయండి.
ఇవీ చూడండి: టీమ్ఇండియా విజయం నుంచి స్ఫూర్తిపొందుతాం: రూట్
Last Updated : Dec 6, 2021, 11:57 AM IST