తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్యాన్స్​తో క్రికెటర్​ కొట్లాట.. కేసు నమోదు! - ఉమర్​ అక్మల్​ ఫ్యాన్స్​తో వివాదం

పాకిస్థాన్​ క్రికెటర్​ ఉమర్​ అక్మల్(Umar Akmal)​.. అతడి అభిమానులు మధ్య వాగ్వివాదం జరిగి కొట్లాట వరకు వెళ్లింది!. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Umar Akmal
ఉమర్​ అక్మల్​

By

Published : Jul 11, 2021, 5:30 AM IST

వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్​ మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​ ఉమర్​ అక్మల్(Umar Akmal)​ ఇప్పుడు మరోసారి హాట్​టాపిక్​గా మారాడు. తనను చూడటానికి వచ్చిన అభిమానులతో వాగ్వావాదానికి దిగాడట! ప్రస్తుతం ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఏం జరిగింది?

అక్మల్​ తమ పక్క ఇంటికి వచ్చాడని తెలిసి నలుగురు అభిమానులు అతడి ఆటోగ్రాఫ్​ కోసం అక్కడికి వెళ్లారు. ఏమైందో తెలీదుగానీ అతడికి వారికి మధ్య ఘర్షణ ఏర్పడి కొట్లాట వరకు వెళ్లింది. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేసి ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా.. ఆ నలుగురే తన​పై దాడిచేసి చంపుతానంటూ బెదరించారని అక్మల్​ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్మల్, తమతో అసభ్యపదజాలంతో మాట్లాడటం సహా తన సహాయక సిబ్బందితో కొట్టించాడని ఆ నలుగురు వాపోయారని సమాచారం. ప్రస్తుతం పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలతో గతేడాది ఉమర్​ అక్మల్​పై మూడేళ్ల నిషేధాన్ని విధించింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ). ఆ తర్వాత శిక్షకాలాన్ని 18 నెలలకు కుదించింది.

ఇదీ చూడండి:'నాపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయండి'

ABOUT THE AUTHOR

...view details