U19 World Cup: అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మరో అడుగు ముందుకేసింది. పాకిస్థాన్‌ను 119 పరుగుల తేడాతో ఓడించి సెమీస్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. టీగ్ విల్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీగ్ విల్లీ(71), కోరి మిల్లర్(64) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో కాశీమ్ అక్రమ్ 3, అవైస్ అలీ 2, జీషన్ జమీర్, మెహ్రన్ ముంతాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
277 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 157కే పరిమితమైంది. 35.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. మెహ్రన్ ముంతాజ్ (29), అబ్దుల్ ఫసీహ్(28), ఇర్ఫాన్ ఖాన్( 27) నామమాత్రంగా రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో విలియమ్ సల్జ్మన్ 3, టామ్ వైట్నీ 2, జాక్ సినీఫీల్డ్ 2, జాక్ నిస్బెట్ ఓ వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాలో బ్యాటర్లు అదరగొట్టారు. టీగ్ విల్లీ(71), కొరీ మిల్లర్(64), క్యాంప్‌బెల్ కెల్లావె(47), కూపర్ కొనొల్లి(33), విలియమ్ సల్జ్మన్(25) రాణించారు.
కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ జైత్రయాత్రకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్‌కు చేరిన పాక్‌కు రెండో సెమీ ఫైనల్‌లో ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది.