U19 World Cup 2021 India Squad: వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభమవనున్న ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత జట్టు కూర్పు పూర్తయింది. ఆల్ ఇండియా జూనియర్ సెలెక్షన్ కమిటి ఈ మేరకు జట్టును ఎంపిక చేసింది. యశ్ ధుల్ సారథ్యంలో ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు చేసింది.
వెస్టిండీస్ వేదికగా 2022 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నీ జరగనుంది. 14వ సారి జరుగుతున్న ఈ టోర్నీలో 16 టీమ్‌లు బరిలోకి దిగుతున్నాయి. ఇందులో భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా నిలిచింది. 2000, 2008, 2012, 2018లో టైటిల్‌ను సాధించింది. జనవరి 15న భారత జట్టు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.