తెలంగాణ

telangana

ETV Bharat / sports

Ind vs Pak: థ్రిల్లింగ్ మ్యాచ్.. చివరి బంతికి గెలిచిన పాకిస్థాన్​

టీమ్​ఇండియా యువ జట్టును పాక్​ టీమ్​ ఓడించింది. దుబాయ్ వేదికగా శనివారం ఈ మ్యాచ్​ చివరి బంతి వరకు వచ్చి థ్రిల్లర్​ను తలపించింది.

U-19 Asia Cup
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్

By

Published : Dec 25, 2021, 10:09 PM IST

అండర్-19 ఆసియాకప్​ తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియా జట్టు ఓటమిపాలైంది. పాకిస్థాన్ చేతిలో రెండు వికెట్ల తేడాతో మ్యాచ్​ చేజార్చుకుంది. పాక్ బ్యాటర్ మహమ్మద్ షెజాద్(81) విజయంలో కీలకపాత్ర పోషించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ రఘువంశీ డకౌట్​ అయ్యాడు. ఆ తర్వాత షేక్ రషీద్(6), కెప్టెన్ యశ్ దుల్(0) త్వరత్వరగా పెవిలియన్​కు చేరారు. ఓ ఎండ్​లో నిలబడిన హర్నూర్ సింగ్(46) మెల్లగా స్కోరు పెంచుతూ పోయాడు.

అయితే టాప్​ఆర్డర్​ వెంటవెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ లోయరార్డర్​ మాత్రం గట్టిగా నిలబడింది. రాజ్​ 25, కౌశల్ 32, రాజ్​వర్ధన్ 33 పరుగులతో మెప్పించారు. ఆరాధ్య యాదవ్ హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. దీంతో 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది.

పాక్ అండర్-19 జట్టు

అనంతరం ఛేదన ప్రారంభించిన పాక్ జట్టుకు కూడా దెబ్బ తగిలింది. ఓపెనర్ అబ్దుల్ డకౌట్ అయ్యాడు. వన్​డౌన్​లో వచ్చిన మహమ్మద్ షెజాద్ అత్యధికంగా 81 పరుగులు చేశాడు.

మిగిలిన బ్యాటర్లలో సదఖత్ 29, కెప్టెన్ ఖసీమ్ 22, ఇర్ఫాన్ ఖాన్ 32, రిజ్వాన్ 29 పరుగులు చేసి జట్టును గెలిపించారు. అయితే చివరి బంతికి బౌండరీ కొట్టిన అహ్మద్.. పాక్​ జట్టును విజయాన్ని అందించాడు.

ABOUT THE AUTHOR

...view details