మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ఝలక్ ఇచ్చింది. మహీ ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్‌ను తొలగించింది. దీనిపై ధోనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అయితే.. కాసేపటికే బ్లూ టిక్‌ను పునరుద్ధరించింది. ఫిబ్రవరి నుంచి ధోనీ ట్విట్టర్ ఖాతా.. వినియోగంలో లేనందున ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ప్రముఖుల, ప్రజా ప్రయోజనాలు ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. ప్రజలు గుర్తించేందుకు వీలుగా ట్విట్టర్ ఈ బ్లూ టిక్‌ను ఇస్తుంది.
7 నెలలుగా నో ట్వీట్
సాధారణంగా.. ఆరు నెలల పాటు ఇనాక్టివేట్‌గా ఉన్న ఖాతాలకు బ్లూ టిక్‌ను తొలగించాలని ట్విట్టర్ నియమ నిబంధనల్లో ఉంది. ధోనీ చివరిగా 2021 జనవరి 8న ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. బ్లూ మార్క్ తొలగించినట్లు చెప్పుకొచ్చింది.
గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడింది ట్విట్టర్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాలను ఇలాగే చేసింది. తిరిగి కాసేపటికే మళ్లీ పునరుద్ధరించింది.
ఇవీ చదవండి:
ఆర్ఎస్ఎస్ చీఫ్ ఖాతా బ్లూటిక్ తొలగింపు.. ప్రత్యక్షం!
వెంకయ్య నాయుడు ఖాతాపై ట్విట్టర్ తికమక