తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​కు ఆ రహస్యం తెలుసు: లక్ష్మణ్

కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌.. టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మను స్లెడ్జింగ్‌ చేశాడని అన్నాడు న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ షేన్‌బాండ్‌. ఈ ఏడాది నెట్స్‌లో సాధన చేస్తుంటే రోహిత్‌, బౌల్ట్‌ ఎలాంటి మాటలు అనుకున్నారో బాండ్‌ వివరించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్లో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుందని అంచనా వేశాడు.

Rohit
రోహిత్

By

Published : Jun 17, 2021, 5:36 AM IST

Updated : Jun 17, 2021, 10:39 AM IST

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మను కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ స్లెడ్జింగ్‌ చేశాడని న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ షేన్‌బాండ్‌ అన్నాడు. కొన్నినెలల క్రితమే వారిద్దరూ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ గురించి మాటలనుకోవడం అద్భుతమని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ను తానెప్పుడూ మాథ్యూ హేడెన్‌ పాత్రలో చూస్తానని తెలిపాడు. కాగా అతడు ఇంగ్లాండ్‌లో రాణిస్తాడని వీవీఎస్‌ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ను నడిపించేది రోహిత్‌ శర్మ అని అందరికీ తెలిసిందే. అదే జట్టుకు ట్రెంట్‌ బౌల్ట్‌ గతేడాది నుంచి ఆడుతున్నాడు. షేన్‌బాండ్‌ బౌలింగ్‌ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. ఈ ఏడాది నెట్స్‌లో సాధన చేస్తుంటే రోహిత్‌, బౌల్ట్‌ ఎలాంటి మాటలు అనుకున్నారో బాండ్‌ వివరించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఫైనల్లో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుందని అంచనా వేశాడు.

రోహిత్

'ఐపీఎల్‌ సీజన్లో రోహిత్‌ శర్మకు నెట్స్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ బంతులు వేస్తాడు. అందులో కొన్ని హిట్‌మ్యాన్‌ ప్యాడ్లకు తగులుతాయి. అలాంటప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ ఇలాగే జరుగుతుందని బౌల్ట్‌ సరదాగా అనేవాడు. వారు కొన్ని నెలల క్రితమే దీని గురించి మాట్లాడుకున్నారు. ఒకరిని ఒకరు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారికి ముందే తెలుసు' అని షేన్‌బాండ్‌ వివరించాడు.

'ఒక ఆటగాడిగా రోహిత్‌ శర్మ అంటే నాకెంతో ఇష్టం. అతడిని మాథ్యూ హేడెన్‌ పాత్రలో ఊహించుకుంటాను. క్లిష్ట పరిస్థితుల్లో అతడు నిలదొక్కుకొని వేగంగా పరుగులు చేస్తాడు. బౌలర్‌పై ఒత్తిడి పెంచుతాడు. అందుకే ముందే అనుకున్నట్టుగా బౌల్ట్‌, రోహిత్‌ మధ్య సమరం కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని బాండ్‌ అన్నాడు.

ఆ రహస్యం రోహిత్‌కు తెలుసు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఇక రోహిత్‌ శర్మకు 2014లో ఇంగ్లాండ్‌లో టెస్టులు ఆడిన అనుభవం ఉందని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఓపెనింగే కీలకమని పేర్కొన్నాడు. 'తన ఆఫ్‌స్టంప్‌ ఎక్కడుందో తెలుసుకోవడం ప్రతి ఓపెనర్‌కు ముఖ్యం. దక్షిణాఫ్రికా సిరీస్​లో రోహిత్‌ టీమ్‌ఇండియాకు ఓపెనింగ్‌కు మారినప్పటి నుంచి అలాగే చేస్తున్నాడు. ఆ సిరీస్​లో అద్భుతంగా ఆడాడు. ఆరంభంలో క్రమశిక్షణతో ఉన్నాడు. దానినే ఇంగ్లాండ్‌లో పునరావృతం చేస్తే కచ్చితంగా పరుగులు చేస్తాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ రూపంలో అతడికి సవాల్‌ ఎదురవుతుంది. అయితే అతడి బౌలింగ్‌లో ఎడమకాలిని అడ్డంగా పెట్టొద్దని హిట్‌మ్యాన్‌కు తెలుసు. అతడు బౌలర్‌ లేదా అంపైర్‌ వైపు బ్యాటు ఫుల్‌ ఫేస్‌తో ఆడాలి' అని లక్ష్మణ్ వివరించాడు.

ఇవీ చదవండి:WTC Final: అలా అయితే రోహిత్ శర్మకు కష్టమే!

Last Updated : Jun 17, 2021, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details